Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గౌతమి గర్భవతా? అందుకే ఆస్పత్రికి వెళ్లిందా?

నరసాపురానికి చెందిన గౌతమి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తొలుత రహదారి ప్రమాద కేసుగా పోలీసులు తేల్చగా సీబీసీఐడీ దర్యాప్తుతో తిరిగి హత్యగా నమోదు చేశారు.

Advertiesment
గౌతమి గర్భవతా? అందుకే ఆస్పత్రికి వెళ్లిందా?
, గురువారం, 5 జులై 2018 (12:33 IST)
నరసాపురానికి చెందిన గౌతమి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తొలుత రహదారి ప్రమాద కేసుగా పోలీసులు తేల్చగా సీబీసీఐడీ దర్యాప్తుతో తిరిగి హత్యగా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకొని అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు.
 
పాలకొల్లు గ్రామీణ సీఐ కె.రజనీకుమార్‌ నరసాపురంలో విచారణ జరిపారు. మృతురాలు గౌతమి చెల్లెలు పావని, తల్లి అనంతలక్ష్మి ఉంటున్న ఇంటికి వెళ్లి సజ్జా బుజ్జి, గౌతమిల వివాహం గురించి ఆరా తీశారు. వివాహం ఎక్కడ జరిగిందనే కోణంలో ఆరా తీయడంతో పాటు పెళ్లికి సంబంధించిన ఛాయా చిత్రాలను సేకరించారు. వీటిని బట్టి వివాహం ఒక ఇంట్లో జరిగినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆ ఇల్లు ఎవరిదై ఉంటుందనే కోణంలో విచారిస్తున్నారు. 
 
అదేసమయంలో ప్రమాదం జరిగిన రోజున గౌతమి పాలకొల్లు ఆసుపత్రికి దేనికి వెళ్లిందన్న విషయాన్ని తెలుసుకుని సంబంధించిన రిపోర్టులను తీసుకొన్నారు. ఆ తర్వాత ఓ బ్యూటీపార్లర్‌కు వెళ్లి అక్కడ విచారణ జరిపారు. నరసాపురం పట్టణంలో కెనరా బ్యాంకులో నిందితులకు సంబంధించిన లావాదేవీలపై ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి అన్నవరం, కానూరు, మార్టేరు, దర్బరేవు, నవరసపురం తదితర ప్రాంతాల్లోను విచారణ చేసినట్లుగా తెలుస్తోంది. 
 
అరెస్టుకు రంగం సిద్ధం హత్య కేసులో నిందితులైన ఏడుగురిలో నలుగురు ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే. మిగిలిన ముగ్గురిని అరెస్టు చేసేందుకు పోలీసులు అడుగులేస్తున్నారు. దీనిలో భాగంగా ఘటన జరిగిన రోజున గౌతమి, పావనిలను గుర్తించేలా ప్రమాదం చేసిన వాహనదారులకు సమాచారమిచ్చిన నరసాపురానికి చెందిన రమేష్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొనే అవకాశవుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పబ్‌లో ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలతో "ఆ" నృత్యాలు.. ఎక్కడ?