విమానంలో 11నెలల పసికందు మృతి.. ఊపిరాడక పోవడంతోనే?
అమెరికా నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ఓ 11 నెలల పసికందు మరణించింది. విమానంలో ఊపిరాడక ఆ చిన్నారి కన్నుమూసిందని వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం
అమెరికా నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ఓ 11 నెలల పసికందు మరణించింది. విమానంలో ఊపిరాడక ఆ చిన్నారి కన్నుమూసిందని వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక తెగ ఇబ్బందిపడింది. అయితే విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి విశ్వప్రయత్నాలు చేసినప్పటికి సఫలం కాలేదు.
కానీ ముందస్తుగా హైదరాబాద్ విమానాశ్రయంలో డాక్టర్‌ను ఆంబులెన్స్‌ను సిద్ధంగా వుంచారు. లాండింగ్ అయిన వెంటనే హుటాహుటినా స్థానిక అపోలో మెడికల్ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తేల్చేశారు. శ్వాస ఆడకనే బిడ్డ చనిపోయిందని చెప్పారు. శిశువు మృతి పట్ల విమాన సంస్థ, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.
పసికందును కోల్పోయిన తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆర్నవ్ అనే ఆ చిన్నారి గత ఏడాది అక్టోబర్‌లో అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.