Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మరోవారం లాక్డౌన్ ప్రారంభం : సీఎం కేసీఆర్ నిర్ణయం

Webdunia
మంగళవారం, 25 మే 2021 (08:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరోవారం రోజులు పాటు లాక్డౌన్ పొడగించే అవకాశం ఉంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, వైద్యాధికారుల ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు మేరకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే ఈ విషయంపై వాణిజ్య, ఎక్సైజ్ శాఖలకు ప్రభుత్వం సంకేతాలిచ్చిందట. ఇదిలావుంటే, కరోనా నియంత్రణ, లాక్‌డౌన్ పొడిగింపు అంశాలపై సీఎం కేసీఆర్ ఈ నెల 28వ తేదీన సమీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజే లాక్‌డౌన్ పొడిగింపుపై అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
 
జూన్ మొదటి వారం వరకు లాక్‌డౌన్ పొడిగించాలని మెజారిటీ రాష్ట్రాలు భావిస్తున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణలో ఈ నెల 12వ తేదీ నుంచి లాక్‌డౌన్ కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో కేసుల సంఖ్య కొంతవరకు తగ్గింది. కాగా, ప్రస్తుతం తెలంగాణలో నేటి నుంచి రెండు డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది.
 
మరోవైపు, కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ కరోనాను కట్టడి చేయాలని సూచించారు. 
 
దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని పేర్కొన్నారు. దాన్ని కొనసాగిస్తూనే, ప్రాధమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ నిరాకరించకుండా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments