Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానికంలో విచిత్రం : కలిసి పోటీ చేస్తున్న వైకాపా - టీడీపీ

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (11:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే నామినేషన్లపర్వం ముగిసింది. అలాగే, ఈ నెలాఖరులో పోలింగ్ జరుగనుంది. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైకాపా తొక్కని అడ్డదారంటూ లేదు. నామినేషన్ల సమయంలోనే రక్తపాతానికి పాల్పడింది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంది. వారిపై భౌతికదాడులకు దిగింది. ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. వైకాపా, టీడీపీ నేతలు కలిసి పోటీ చేస్తున్నాయి. 
 
నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే వైకాపా, టీడీపీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింతగా పెరిగిపోయాయి. అధికార పార్టీ వైసీపీతో టీడీపీ నేతలు భీకరమైన యుద్ధాన్నే సాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అదికాస్తా తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై అధికార పార్టీ నేతలు భౌతికదాడులకు దిగుతున్నారు. 
 
టీడీపీ నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్నిరకాలుగా నిలువరిస్తున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంతో నేరుగా ఢీకొంటున్నారు. వైసీపీ నేతల అరాచకాలు, ప్రభుత్వ నిర్భందకాండపై న్యాయస్థానాలలో పోరాటం సాగిస్తున్నారు. అయితే ఇదంతా రాష్ట్రస్థాయిలో మనకు కనిపిస్తున్న దృశ్యం. స్థానికంగా పరిస్థితులు మరోరకంగా ఉన్నాయి.
 
అసలేంజరిగిందంటే.. వైసీపీ ప్రలోభాలకు తలొగ్గారో.. మరెంటో గానీ, పలుచోట్ల అధికార పార్టీ వైసీపీతో పలువురు టీడీపీ నేతలు జట్టుకట్టారు. ఆ పార్టీకి అండగా నిలుస్తున్నారు. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో వైసీపీ-టీడీపీ ములాఖత్ అయ్యాయి. ముట్లూరు ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ ఘటన జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 
 
అయితే వైసీపీతో ములాఖత్ అవటాన్ని ముట్లూరు టీడీపీలోని ఓవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జరుగుతున్న పరిణామాలను ఎంపీ జయదేవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీని వైసీపీకి అమ్ముకుంటున్నారని మాజీ ఎంపీపీ పూనాటి రమేష్‌పై ఎంపీకి ఫిర్యాదు చేశారు. పరిస్థితులను చక్కదిద్దాలంటూ విజ్ఞప్తి చేశారు. మరి ఎంపీ జయదేవ్ కల్పించుకుని పరిస్థితులను చక్కదిద్దుతారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments