Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతాం : కర్నూలు నగర మేయర్

Webdunia
మంగళవారం, 31 మే 2022 (10:41 IST)
తమ పార్టీకి చెందిన మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర బహిరంగ సభకు జనాలు లేక వెలవెలబోయాయంటూ కొన్ని పత్రికలు వార్తలను ప్రచురించాయని, ఆ పత్రికలకు చెందిన విలేకరుల వీపులు వాయగొడతామంటూ కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య హెచ్చరికలు జారీచేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు కర్నూలులో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 
 
వైకాపా మంత్రులు ఇటీవల సామాజిక న్యాయభేరీ పేరుతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్రను చేపట్టారు. ఈ బస్సుయాత్ర కర్నూలుకు వచ్చినపుడు జనాలు కనిపించలేదు. దీన్ని కొన్ని పత్రికలు ఫోటోలు తీసి వార్తల రూపంలో ప్రదర్శించాయి. 
 
దీనిపై కర్నూలు మేయర్ బీవై రామయ్య స్పందిస్తూ, బస్సు యాత్ర కర్నూలుకు వచ్చినపుడు మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందని, దీంతో ప్రజలు నీడ చాటుకు వెళితే సభకు జనాలు రాలేదంటూ కొన్ని పత్రికలు ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తే వీపులు వాయగొడతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

నిహారిక కొణిదెల సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సాయి దుర్గా తేజ్

బిచ్చగాడుతో పోలిస్తే 80 శాతం ఎమోషన్ లవ్ గురు లోనూ ఉంది : విజయ్ ఆంటోనీ

కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి.. ఎన్టీఆర్ నోట పవన్ మాట

హీరో రవితేజ 75వ ప్రచార చిత్రం - సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లో.2025 సంక్రాంతికి విడుదల

జాతర షాట్ కోసం 51 టేక్‌లు ఇచ్చిన అల్లు అర్జున్

గ్రీన్ టీతో జుట్టు కడగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు, ఏంటవి?

వేసవిలో మజ్జిగ తాగితే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వేసవి తాపం నుంచి కాపాడే 6 హెర్బల్ పానీయాలు

మామిడి గింజలులో దాగున్న ఆరోగ్య రహస్యాలు, ఏంటవి?

వేసవిలో దూరం పెట్టాల్సిన 5 స్పైసీ ఫుడ్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments