కర్నూలు జిల్లాలో పట్టపగలే రెచ్చిపోయిన వేటగాళ్లు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (14:28 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలోని ఆందోనీ మండలం నారాయణపురం గ్రామం పొలాల్లో వేటగాళ్లు పట్టపగలే రెచ్చిపోయారు. ఈ గ్రామ పొలాల్లో తిరిగే జింకల మందపై తుపాకులతో విరుచుకపడ్డారు. దీంతో వేటగాళ్ల తుపాకీ తూటాలకు ఏకంగా 12 జింకలు మృత్యువాతపడ్డాయి. వేటగాళ్లు దుండగులు జీప్‌లో వచ్చి తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో జింకల మందపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తుపాకీ తూటాలు తగిన జింకలు నేలకొరిగాయి. 
 
ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న కత్తులతై జింకల తలలను వేరు చేసి మిగిలిన మొండెంతో పారిపోయారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీ ఆదివారం జరిగింది. ఈ వేటగాళ్ళ దుశ్యర్యలను చూసిన గ్రామస్తులు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు హుటాహుటిన అక్కడకు వచ్చి మొండెం నుంచి వేరు చేసిన జింకల తలలను స్వాధీనం చేసుకున్నారు. పట్టపగలే వేటగాళ్లు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments