ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రూ.5 కోట్లకు పైగా విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు, వెండి బిస్కెట్లను, బంగారు ఆభరణాలుతో పాటు రూ.90 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళుతున్న ఎన్ఎల్01 బి1149 అనే నంబరు కలిగిన స్వామి అయ్యప్ప ప్రైవేట్ ట్రావెల్ బస్సును పంచలింగాల వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఐదుగురు ప్రయాణికుల వద్ద 28.5 కేజీల వెండి బిస్కెట్లు, మరో వ్యక్తి జాకెట్‌లో 8.250 కేజీల బంగారం బిస్కెట్లు, వాందరి సీట్ల కింద రూ.90 లక్షలకు పైగా నోట్ల కట్టలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.