Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందు పనితీరుపై ఆయుష్ నివేదిక! ... ఏపీలో కనిపించని ఆయుర్వేద వైద్యుడు

Webdunia
ఆదివారం, 30 మే 2021 (10:07 IST)
కరోనా రోగులకు తక్షణం స్వస్థత చేకూర్చే కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందు పనితీరుపై తిరుపతి ఆయుర్వేద వైద్య కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థలు అధ్యయనం చేశాయి. ఇందుకు సంబంధించిన నివేదికను శనివారం ఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఆన్‌లైన్‌లో సమర్పించాయి. 
 
ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కేంద్ర పరిశోధన సంస్థ ఈ మందుపై తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. మరోవైపు, ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 
ఇదిలావుంటే, వారం రోజుల అజ్ఞాతం తర్వాత ఆనందయ్యను ఇంటివద్దకు పోలీసులు తీసుకొచ్చారు. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున మళ్లీ అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. 
 
మరోవైపు, ఆనందయ్య నిర్బంధంపై జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి తలోజి తీవ్రంగా స్పందించారు. ఆయనను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
శనివారం కృష్ణపట్నంలో విలేకరులతో మాట్లాడిన ఆచారి.. కుటుంబ సభ్యుల నుంచి ఆనందయ్యను దూరం చేయడం దారుణమన్నారు. ఆనందయ్య మందును ప్రసాదంలా అందరికీ పంపిణీ చేసేలా జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆనందయ్యను నిర్బంధించిన వారిపై బీసీ కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments