Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికకు 14 యేళ్లు... అతనికి 40 యేళ్లు - లొంగదీసుకుని శీలాన్ని దోచుకున్నాడు!

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో దారుణం జరిగింది. ఓ 14 యేళ్ల మైనర్ బాలికపై కన్నేసిన 40 యేళ్ళ వ్యక్తి ఆమె శీలాన్ని దోచుకున్నాడు. అభంశుభం తెలియని ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత బాలికపై ప్రతి రోజూ అత్యాచారం చేస్తూ పైశాచికానందం పొందుతూ వచ్చాడు.

ఈ క్రమంలో ఆ బాలిక అస్వస్థతకు లోనుకావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారానికి గురైనట్టు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పేరు ఆంటోని. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు, కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని నీలం రాహుల్ (18) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 
 
గురువారం రాత్రి తన స్నేహితుని అన్న పెళ్లి ఊరేగింపుకు వెళ్లిన రాహుల్‌ను ఆలస్యం కావడంతో ఫోన్లో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన రాహుల్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments