Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోట్లుంటే సరిపోదు.. ప్రజల అభిమానం కావాలి : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (10:41 IST)
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి చెందిన వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వరం పెంచారు. రూ.కోట్లు ఉంటే సరిపోవని, ప్రజల అభిమానం ఉండాలన్నారు. ముఖ్యంగా, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లాగా డ్రామాలు చేయడం తనకు తెలియదన్నారు. ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పి తాళి కట్టే సమయంలో పారిపోయిన వ్యక్తి అని అన్నారు. వైకాపా అధిష్టానంపై తిరుగుబాటు చేసిన తర్వాత ఆయన మంగళవారం నగరంలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, "2019 ఎన్నికల్లో తెదేపా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆదాల.. నామినేషన్‌కు ముందురోజు వైకాపా కండువా కప్పుకున్నారు. ఇలాంటి వారా నన్ను విమర్శించేది? నెల్లూరు రూరల్‌లో రూ.200 కోట్లు, రూ.300 కోట్లు పెట్టి కోటంరెడ్డి సంగతి తేల్చేస్తామని కొంతమంది ప్రగల్భాలు పలుకుతున్నారు. 
 
2024 ఎన్నికల్లో తేల్చుకుందాం. ఈ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ప్రజల మనసుల్లో అభిమానం ఉండాలి కానీ, వందల కోట్లతో విజయం సాధించలేరు. కార్పొరేటర్ల సంఖ్య ముఖ్యం కాదు. ఎంతమంది ప్రజల మనసుల్లో ఉన్నామన్నదే ప్రధానం. కొందరు రాజకీయ నాయకుల్లాగా చివరిరోజు దాకా అధికార పార్టీలో ఉండి, ఆఖర్లో పార్టీ మారే స్వభావం నాది కాదు. అవమానించిన చోట ఉండలేక, ఇచ్చిన జీవోలకు కూడా నిధులు రాక, ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, విధిలేని పరిస్థితుల్లో బయటకు వచ్చాను. ప్రజలే న్యాయనిర్ణేతలు. 2024లో ఏ తీర్పు ఇచ్చినా శిరసావహిస్తా. ఓ సైనికుడిలా పనిచేస్తా" అని కోటంరెడ్డి పేర్కొన్నారు. 
 
మొయిళ్ల సురేష్‌రెడ్డి, గౌరిపై విమర్శలు చేయనని, అది వారి విచక్షణకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర సమయంలో భోజనాల్లేక నెల్లూరులోని ఓ కల్యాణ మండపంలో ఉన్నప్పుడు తాను పరామర్శించడం నేరమా అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments