Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ తో కొరియా దేశ రాయబారి భేటీ

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (07:56 IST)
భారతదేశం తరుపున కొరియా దేశానికి రాయబారిగా ఉన్న శ్రీప్రియ రంగనాధన్ సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల్లో కొరియన్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలపై వారు చర్చించారు. అనంత‌రం సిఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సుదీర్ఘ మైన సముద్ర తీరం ఉందని తీరం ప్రాంతంలో వివిధ  పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఓడరేవులు, విమానాశ్రయిలు అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆహార శుద్ధి రంగం అభివృద్ధికి,అలాగే చేపలు, రొయ్యల సాగుకు సంబంధించి ఆక్వా రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్త పోర్టులు కూడా ఏర్పాటు కానున్నాయని ఎగుమతి దిగుమతులకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాలకే గాక విదేశాలకు ఎగుమతి దిగుమతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అనువుగా ఉంటుందని  సిఎస్ నీలం సాహ్ని చెప్పారు.

భారత్ తరుపున కొరియా దేశానికి రాయబారిగా ఉన్న శ్రీప్రియ రంగనాధన్ మాట్లాడుతూ రేవుల అభివృద్ధి, మారిటైమ్ శిక్షణ, నైపుణ్య శిక్షణ తదితర అంశాలకు సంబంధించి కొరియన్ సంస్థలు రాష్ట్రంతో పనిచేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల వివిధ అవకాశాలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రంజిత్ భార్గవ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments