Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ సీఎస్‌ పై బదిలీ వేటు.. ఆంతర్యం ఏమిటో?

ఏపీ సీఎస్‌ పై బదిలీ వేటు.. ఆంతర్యం ఏమిటో?
, సోమవారం, 4 నవంబరు 2019 (22:47 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారు. ఆయనను బాపట్లలో ఉన్న మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు.

ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే తన విధులను భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్‌ నీరబ్ కుమార్‌కు అప్పగించి.. వెంటనే వెళ్లి తన విధుల్లో చేరాలని జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ రేసులో నీలం సహానీ, సమీర్ శర్మ ఉన్నట్టు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత కేబినెట్‌లో ‘వైఎస్ఆర్ అవార్డు’ పేరుతో ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.

అయితే, దానికి సంబంధించిన ఫైల్ మీద ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. కానీ, ఆ పనిచేయకుండా ప్రవీణ్ ప్రకాష్ నేరుగా కేబినెట్‌లో ప్రవేశపెట్టినట్టు సమాచారం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎల్వీ సుబ్రమణ్యం.. ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

దీనిపై ఆగ్రహంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసినట్టు సమాచారం. ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ ఉత్తర్వులను కూడా ప్రవీణ్ ప్రకాష్ జారీ చేశారు.
 
ఆంతర్యం ఏమిటో..?: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అర్ధాంతరంగా మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. ఈ మార్పు పలు అనుమానాలకు తావిస్తోంది. ఐఏఎస్ అధికారుల మధ్య వివాదాలా, ముఖ్యమంత్రితో వైరుధ్యమా, లేక మారేదన్నా కారణమా అనేది ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 
 
వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్టే.. మాజీ మంత్రి సోమిరెడ్డి ట్విట్
ఏపీలో జగన్ ప్రభుత్వంలో మరో రివర్స్ సీన్..సాధారణంగా సీఎస్ ఇతర ప్రిన్సిపల్ సెక్రట్రరీలను, ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులిస్తారు. ఈ ప్రభుత్వంలో అంతా  రివర్సే కదా!

షోకాజ్ నోటీసు తీసుకున్న అధికారి నోటీసు ఇచ్చిన అధికారిని బదిలీ చేయడం వింతైన ఘటన. టీటీడీలో అన్యమత ప్రచారాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలే ఎల్వీఎస్  కొంప ముంచాయా. ఎన్నికల కోడ్ సమయంలో టీడీపీ అంతం కోరుకున్న ఎల్వీఎస్ కి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్టే ఈ బదిలీ..
 
 
సీఎస్‌ బదిలీ వెనుక కారణం ఇదేనా?
1. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉండాలన్నది ముఖ్యమంత్రికున్న విశేష అధికారం. సీఎం పీఠంలోకి జగన్‌ వచ్చినా, అదే సీట్లో కొనసాగుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొనసాగించారే తప్ప, తప్పించలేదు. 
 
2. సీఎస్‌ పదవిలోనే కాదు, ఏయే శాఖలకు ఎవరు కార్యదర్శిగా ఉండాలో, ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శులకు, ముఖ్యకార్యదర్శులుగా, ప్రత్యేక కార్యదర్శులుగా ఎవరు ఉండాలన్నది కూడా ముఖ్యమంత్రికున్న విశేష అధికారాల్లో ఒకటి. 
 
3. ఇటీవలి కాలంలో పలానా శాఖకు చురుకైన అధికారి ఉండాలి.. అని సీఎం సమీక్షా సమావేశాల్లో అడుగుతున్నారు. అంతేకాదు తాను అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడానికి కష్టపడే మనస్తత్వం, చురుగ్గా ఉండే వాళ్లు కావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. కాని ఆయన సూచించిన వారి పేర్లు వారాల తరబడి పెండింగులో ఉండిపోతున్నాయి. పలానా వ్యక్తిని పలాన స్థానంలో పెట్టాలని సీఎం  నేరుగా చెప్పినా ఫలితం ఉండడంలేదు. తనకు నచ్చడంలేదనే వ్యక్తిగత కారణంతో రోజులు తరబడి.. ఐఏఎస్‌ అధికారుల నియామకాలు నిలిచిపోతున్నాయి. ఇది తీవ్రమైన ఉల్లంఘన. 
 
4. ప్రవీణ్‌ ప్రకాష్‌కు జారీచేసిన నోటీసుల్లో రెండు కారణాలను ఎల్వీ సుబ్రహ్మణ్యం చూపించారు. వాస్తవానికి ఆరెండు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో, ఇతర అధికారులు, సీఎస్‌ ఉన్నప్పుడు తీసుకున్నవే. ఆ నిర్ణయాలు సీఎస్‌కు తెలియకుండా జరిగినవి కావు. 
 
5. వైయస్సార్‌ పేరుమీ లైఫ్‌టైం అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ సమావేశానికి ముందు ఎజెండాలో ఎలాంటి అంశాలు పెట్టాలన్నదానిపై జరిగిన సన్నాహక సమావేశంలో సీఎం కార్యాలయ కార్యదర్శులు, చీఫ్‌ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

రాష్ట్రంలో సామాజిక సేవ, ఇతరత్రా రంగాల్లో సేవచేసినవారికి ప్రతిభ చూపిన వారికి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా ఈ సమావేశంలో నేరుగా ముఖ్యమంత్రే సీఎస్‌కు వెల్లిడించారు. అక్కడ సీఎస్‌ దీనికి అంగీకారం కూడా తెలిపారు. రేపటి క్యాబినెట్‌ అజెండాలో పెడదామన్నా? అని సీఎం చెప్పారు కూడా.

తీరా ప్రవీణ్‌ ప్రకాష్‌ ఫైలు తయారుచేశాక.. ఆర్థిక శాఖ అనుమతి లేదని వెనక్కి పంపారు. వాస్తవానికి ఆర్థికశాఖ అనుమతితో సంబంధం లేకుండా ఫైలును కేబినెట్లోనే పెట్టొచ్చు. ఆతర్వాత ఆ నిర్ణయాన్ని ఆర్థికశాఖతో సమన్వయం చేసుకోవచ్చు. సీఎం ఎదుట ఓకే అని, ఆతర్వాత కొర్రీ పెట్టడం సీఎస్‌పై ఆగ్రహానికి దారితీసింది. 
 
6. ప్రవీణ్‌ ప్రకాష్‌కు సీఎస్‌జారీచేసిన నోటీసులో మరొక ముఖ్యమైన అంశం గ్రామ న్యాయాలయాలు అంశం. హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రామ న్యాయాలయాలు పెట్టాలని నిర్ణయం. దీనికి సంబంధించి సీఎస్‌ పంపిన ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు.

అయితే తర్వాత సీఎం... గ్రామ న్యాయాలయాలపై ఏర్పాటుపై మరింతగా పరిశీలన చేద్దామన్నారు. సీఎం నిర్ణయం మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ నిలిపేశారు. ఎంత ఖర్చు చేస్తున్నాం? ఎన్ని  పెడుతున్నా? అవి సరిపోతాయా? ఇంకా పెంచాలా? వద్దా? అన్నదానిపై న్యాయశాఖ కార్యదర్శితో సమావేశం పెట్టమని సీఎం ఆదేశించిన మీదటే ప్రవీణ్‌ ప్రకాష్‌ నిలిపేశారు. పై వ్యవహారం అంతా సీఎం, సీఎస్‌ల సమక్షంలోనే జరిగింది. అయినా సరే, ఆఫైలును ఎందుకు పంపలేదంటూ సీఎస్‌ పట్టుబట్టడం... తీవ్రమైన ఉల్లంఘనగా భావించారు. 
 
పై రెండు విషయాలను చూస్తే ఆ నిర్ణయాలేవీ సీఎస్‌కు తెలియకుండా తీసుకున్నవి కాదు. అంతేకాక, సీఎస్‌ సమక్షంలోనే ఆయనకు చెప్పే ముఖ్యమంత్రి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరస్పర విశ్వాసం ఉండాలనే ఆలోచనతో సీఎం దాపరికం లేకుండా నడుచుకున్నారు.

అదే సమయంలో తన సమక్షంలో, తనకు తెలిసీ ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా సీఎం నిర్ణయాలను సీఎస్‌ కూడా పాటించాలి. అలా కాక సాంకేతిక అంశాలను చూపించి, ఆ నిర్ణయాలను సవాల్‌ చేసేలా నిలుపుదల చేయడం, సీఎంకు తనకు చెప్పినా సరే.. మళ్లీ అదే సాంకేతిక అంశాలను చూపించి ఏకంగా ముఖ్యమంత్రి కార్యదర్శికి షోకాజ్‌ నోటీసు జారీచేయడాన్ని, భారతదేశంలో ఏముఖ్యమంత్రికూడా అంగీకరించరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగబాబుకు ఏమైంది? ఎందుకలా మాట్లాడారు? తెదేపా నాయకులు షాక్