Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగబాబుకు ఏమైంది? ఎందుకలా మాట్లాడారు? తెదేపా నాయకులు షాక్

Advertiesment
నాగబాబుకు ఏమైంది? ఎందుకలా మాట్లాడారు? తెదేపా నాయకులు షాక్
, సోమవారం, 4 నవంబరు 2019 (22:45 IST)
పవన్ బాబు ఒక శక్తి.. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడం జనసేనకే సాధ్యం. అయితే ఒక్కటి మాత్రం నిజం ఒక వ్యక్తి వల్ల భవన కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం కార్మికుల జీవితాల్లో చీకటిని నింపింది. మనోదైర్యాన్ని కోల్పోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశారు.
 
నాగబాబు ప్రసంగం ఆద్యంతం ఆశక్తికరంగా మారింది. లాంగ్ మార్చ్ లోనే పవన్ కళ్యాణ్ తరువాత ప్రత్యేక ఆకర్షణ నాగబాబే. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసిన నాగబాబు ఓడిపోయారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేకపోయినా మొదటిసారి లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
అయితే లాంగ్ మార్చ్‌కు టిడిపి, ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతిచ్చాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారన్న విషయాన్ని నాగబాబు పూర్తిగా మర్చిపోయారేమో.. టిడిపిపై దుమ్మెత్తి పోశారు. నేనొక సామెత చెబుతాను. ఓ ఊరిలో ఓ పెద్దాయన తన ఇంటిముందు వరండాపై కూర్చుని దారిన పోయే వారిని తిడుతూ ఉంటాడు. పెద్దాయన కావడంతో కొంతమంది లైట్ తీసుకుంటే మరికొంతమంది మాత్రం ఈ పెద్దాయన ఎప్పుడు చచ్చిపోతాడా అని.
 
అయితే పెద్దాయనకు అనారోగ్యం వచ్చింది. తన కొడుకును పిలిచి ఒరే.. నేను మంచివాడ్ని అని జనం నుంచి చెప్పించుకోవాలిరా.. ఏదో ఒకటి చెయ్యి అంటూ చెప్పి చనిపోతాడు. అంత్యక్రియలంతా పూర్తవుతాయి.. అతని కొడుకు తండ్రి కూర్చున్న అదే వరండాపై కూర్చుని దారిన వెళ్ళే వారందరినీ తన్నడం ప్రారంభిస్తాడు. అప్పుడు జనం వీడికన్నా వీడి తండ్రి బెట్టర్ అంటూ చెబుతారట. ఇందులో తండ్రి టిడిపి, కొడుకు వైసిపి అన్నాడు నాగబాబు. దీంతో ఒక్కసారిగా స్టేజ్ పైన ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా టిడిపి నాయకులైతే సైలెంట్‌గా కూర్చుండిపోయారు. నాగబాబు ఎందుకిలా మాట్లాడారు అంటూ జనసైనికులు ఒకరిముఖాలు మరొకరు చూసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు అలా చెప్పడం తప్పు.. జగన్‌కు ముద్రగడ లేఖ