Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే ధర్మారెడ్డి నీకు రోజులు దగ్గరపడ్డాయ్... కొండా సురేఖ వార్నింగ్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (11:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డికి మాజీ మంత్రి కొండా సురేఖ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ధర్మారెడ్డి నీకు రోజులు దగ్గరపడ్డాయ్ అంటూ గట్టిగా హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న పరకాలలో చిచ్చు రేపారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. 
 
ఈ నియోజకవర్గంలోని ఆత్మకూర్ మండలి ఆగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర నూతన పాలకవర్గం ఇటీవల సమావేశమైంది. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని కూల్చివేయాలని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, తెరాస శ్రేణులు స్థూపాన్ని ధ్వంసం చేయడం జరిగిపోయింది. ఈ విషయం తెలిసిన కొండా దంపతులు తెరాస శ్రేణులను అడ్డుకున్నారు. ఫలితంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
ఈ పరిణామాలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కొండా సురేఖ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మారెడ్డి ఈ స్మారక స్థూపాన్ని తొలగించాలని చూస్తున్నారని, ఈ రోజు మరింతగా బరితెగించారని ఆరోపించారు. 
 
గతంలో ఉన్న కలెక్టర్ కరుణను కూడా తప్పుదారి పట్టించారని సురేఖ అన్నారు. ఆమె విచారణ జరిపి స్మారక స్థూపం ఉన్న స్థలాన్ని ప్రైవేటు స్థలంగా మార్చారని చెప్పారు. ధర్మారెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, రోజులు దగ్గరపడ్డాయని ఆమె జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments