Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ గురించి ఎక్కువగా మాట్లాడటం పరమ వేస్ట్: హమ్మ! కొడాలి నాని ఎంత మాటనేశాడు?

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:03 IST)
మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నందిగామలో పర్యటించిన ఆయన.. పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ ట్రాక్టర్ నడపడంపై మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా ఉంది. వరదలు ఎప్పుడు వచ్చాయి. ఎప్పుడు పరిశీలిస్తున్నారు. మొదటి ట్రిప్పు తలకాయ ఉన్న వాడు కొల్లేరులో పెట్టుకుంటారా..?. లోకేష్ ఆఫ్ నాలెడ్జ్.. పార్టీ నడపడం రాదు, ట్రాక్టర్ నడపడం రాదు.

తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ నాయకత్వంలో కొల్లేటిలో ట్రాక్టర్ ఏ విధంగా దించాడో టీడీపీని కూడా దించుతాడు. బుద్ధి ఉన్నోడు ముందుగా దిగిపోండి ట్రాక్టర్ నుండి పార్టీ నుండి లోకేష్ గురించి ఎక్కువగా మాట్లాడటం పరమ వేస్ట్’ అని మంత్రి నాని వ్యాఖ్యానించారు.
 
నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా వరద బాధిత ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపిన విషయం విదితమే. అయితే ఆ ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను కంట్రోల్ చేసి లోకేష్‌ను కిందికి దించేయడంతో పెను ప్రమాదమే తప్పింది.

అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments