Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియా ఎక్కడికి వెళ్లదు: మేకపాటి

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:03 IST)
అనంతపురం జిల్లాలో ఏర్పాటై ఉత్పత్తులు మొదలు పెట్టిన 'కియా మోటార్స్' కార్ల పరిశ్రమ తరలిపోతుందని వచ్చిన అసత్య వార్తా కథనాలపై ప్రస్తుతం డిఫెన్స్ ఎక్స్ పో కోసం ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఖండించారు.

కియా ఎక్కడికి వెళ్లడం లేదని సామాజిక మాధ్యమాలు, టీవీ ఛానళ్లు, మీడియాలో ప్రచారం చేస్తున్నదంతా నిరాధారమని తెలుపుతూ మంత్రి  మేకపాటి  గౌతమ్ రెడ్డి వీడియోను విడుదల చేశారు. కియా పరిశ్రమ మరిన్ని అనుబంధ సంస్థలతో విస్తరించాలనుకుంటుందే తప్ప రాష్ట్రాన్ని వీడే అవకాశమే లేదని వెల్లడించారు.

కియా పరిశ్రమకు చెందిన యాజమాన్యంతోనూ చర్చించినట్లు మంత్రి స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాలు , అవకాశవాద రాజకీయాలు చేయాలనుకునేవారు ఎన్నిసార్లు ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు.

పారదర్శకతకే పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతో విశ్వాసంతో  ప్రజలు ఉన్నారని మంత్రి తెలిపారు. బాధ్యతరాహిత్యంతో చేసే దుష్ప్రచారాలను ఎవరూ నమ్మబోరని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments