Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యపై కేఈ చర్యలు

సింహాచలం పరిధిలోని పంచగ్రామాల భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న వాస్తవిక పరిస్థితులు, ఎంత భూమి రైతుల ఆధీనంలో వుంది. సమస్య పరిష్కారానికి వున్న మార్గాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టరు

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (19:08 IST)
సింహాచలం పరిధిలోని పంచగ్రామాల భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న వాస్తవిక పరిస్థితులు, ఎంత భూమి రైతుల ఆధీనంలో వుంది. సమస్య పరిష్కారానికి వున్న మార్గాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టరుకు ఉపముఖ్యమంత్ర ఆదేశించారు. రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సి.ఎం అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో సమీక్ష  నిర్వహించారు. 
 
సమావేశంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, సి.సి.ఎల్.ఏ అనిల్ చంద్ర పునేఠా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ మరియు దేవదాయ శాఖ కమీషనర్ డా.పద్మ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పంచగ్రమాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు ఎలా పరిష్కారం చూపించాలనే అంశంపై చర్చ జరిగింది. 
 
ప్రస్తుతం ఇనామ్ చట్టం ప్రకారం స్థానిక గ్రామాల సమస్యకు పరిష్కారం చూపించలేమని, హైకోర్టు ద్వారానే పరిష్కరించగలమని కలెక్టర్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. 1968లో అప్పటి ఇనామ్ సెటిల్మెంట్ ఆఫీసర్ 5 గ్రామాలను ఇనామ్ గ్రామంగా తప్పుగా నమోదు చేశారని, వాస్తవంగా ఆ భూమి మొత్తం ఎస్టేట్ ల్యాండ్ కిందకి వస్తుందని, వారి దగ్గర ఉన్న ఆధారాలను చూపించారు. గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులతో పాటు రైతుల దగ్గర ఉన్న ఆధారాలను పరిగణలోకి తీసుకొని వారం రోజుల్లో నివేదిక  సమర్పించాలని సి.సి.ఎల్.ఏ కలెక్టర్‌ను ఆదేశించారు. నివేదిక వచ్చిన తరువాత న్యాయ సలహా తీసుకొని తదుపరి చర్యలు తీసుకుందామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments