Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మామిడి పండ్లు అంటే... కేరాఫ్ ఉలవపాడు అనాలి...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నాణ్యమైన మామిడిపండ్ల ఉత్పత్తి వాటి ఎగుమతికి అవసరమైన కనీస మౌళిక సదుపాయాలను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో

Advertiesment
మామిడి పండ్లు అంటే... కేరాఫ్ ఉలవపాడు అనాలి...
, శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (21:22 IST)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నాణ్యమైన మామిడిపండ్ల ఉత్పత్తి వాటి ఎగుమతికి అవసరమైన కనీస మౌళిక సదుపాయాలను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఉలవపాడు మామిడి తోటల క్లస్టర్ అభివృద్ధికి సంబంధించి జాతీయ హార్టీకల్చర్ బోర్డు (National Horticultre Board)కో-ఆర్డినేషన్ సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రం నుండి నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి వాటిని దేశీయ,అంతర్జాతీయ మార్కెట్లకు పెద్దఎత్తున ఎగుమతి చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు వివిధ రకాల మామిడి పండ్లకు ప్రసిద్ధి గాంచిందని దానిని ఒక ప్రధాన క్లస్టర్‌గా అభివృద్ధి చేసి పెద్దఎత్తున మామిడి పండ్ల ఉత్పత్తి, ఎగుమతికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
 
ఇందుకుగాను జాతీయ హార్టీకల్చర్ బోర్డు అందించే నిధులను వినియోగించుకోవడంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం నిధులను కూడా వినియోగించి ఈ పండ్ల తోట అభివృద్ధికి చర్యలు చేపట్టాలని చెప్పారు. ఉలవపాడు మైదాన ప్రాంతంలో ఉన్నందున అక్కడ మామిడి తోటల పెంపకానికి తగిన నీటివసతికి అంతగా ఇబ్బంది ఉండదని అయినప్పటికీ అవసరమైన నీటి కుంటలను (Farm Ponds)ఏర్పాటు చేసుకోవడంతోపాటు పడిన ప్రతినీటి బోట్టును పరిరక్షించుకుని భూగర్భ జలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మామిడిపండ్ల ఉత్పత్తి, ఎగుమతిలో జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఉన్నందున వాటిని నిల్వ చేసేందుకు తగిన స్టోరేజి గోదాములు, లేబొరేటరీ సౌకర్యాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జాతీయ హార్టీకల్చర్ బోర్డును,ఎపి ఎక్స్ పోర్టు డెవలప్మెంట్ అధారిటీకి సిఎస్ దినేష్ కుమార్ సూచించారు. మామిడి పండ్లు నాణ్యత సరిగాలేవని ఎన్ని కన్సైన్మెంట్లు తిరస్కరణకు గురైంది పరిశీలించాలని ఉద్యానవన శాఖ కమీషనర్‌ను సిఎస్ ఆదేశించారు. మామిడిపండ్లకు సంబంధించి పోస్టు హార్వెస్టింగ్ టెక్నాలజీ, మార్కెటింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. 
 
సేంద్రీయ విధానాన్ని రైతులు అవలంభించేలా ప్రోత్సహించాలని అన్నారు.అదేవిధంగా ఉద్యానవన పంటల ప్రోత్సాహానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పధకాలను ప్రవేశపెట్టాయని వాటిపై క్షేత్రస్థాయి రైతాంగం అందరికీ పూర్తి అవగాహన కలిగించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చైత్యం కలిగించాలని సిఎస్ చెప్పారు.ఉలపపాడు మామిడితోటల క్లస్టర్ అభివృద్ధితోపాటు రాష్ట్రంలో నాణ్యమైన మామిడిపండ్ల ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యానవన శాఖ, జాతీయ ఉద్యానవన బోర్డు అధికారులు కలిసి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సిఎస్ దినేష కుమార్ చెప్పారు.
 
అంతకు ముందు ఉద్యానవన శాఖ కమీషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ప్రసిద్ధి గాంచిందని అక్కడ 6వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించగా 8వేల మంది రైతులు వాటిని పండిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో విజయనగరం, గోపాలపురం, నూజివీడు, తిరుపతి ప్రాంతాల నుండి మామిడి పండ్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెటలకు ఎగుమతి చేయడం జరుగుతోందని తెలిపారు. 10 వేల ఎకరాల్లో శేంద్రీయ విధానంలో పండ్లతోటల సాగు చేపట్టారని మరో 7 వేల 500 ఎకరాల్లో ఈవిధానాన్ని ఈ ఏడాది చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
 
జాతీయ హార్టీకల్చర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అరిజ్ అహ్మద్ మాట్లాడుతూ పండ్లతోటల అభివృద్ధికి తగిన తోడ్పాటును అందించేందుకు బోర్డు సిద్ధంగా ఉందని చెప్పారు.పండ్ల ఉత్పత్తులు నిల్వచేసేందుకు తగిన స్టోరేజి గోదాములు నిర్మాణం,రైఫనింగ్ చాంబర్ల  ఏర్పాటుకు తోడ్పాటును అందించడం జరుగుతోందన్నారు.ఇంకా వివిధ అంశాలపై ఈసమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఉద్యానవన, భూగర్భ గనులు, పంచాయితీరాజ్ తదితర శాఖల అధికారులతోపాటు, ఆప్ కాబ్, నాబార్డు, ఆంధ్రాబ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శోభనం గది నుంచి అర్థరాత్రి పారిపోయిన పెళ్లి కొడుకులా ఉంది...