Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి ప్రత్యేక హోదాపై తమాషా చేస్తున్నారా? అదో పొలిటికల్ స్టంట్ : కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారనీ, అందువల్ల అది ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు.

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారనీ, అందువల్ల అది ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ పాలకులు ఏమాత్రం వెనక్కి తగ్గరాదనీ ఆయన కోరారు. అందేసమయంలో ప్రత్యేక హోదా హామీని నెరవేర్చనందుకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై కూడా కేసీఆర్ స్పందించారు. "పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడమనేది ఓ చీప్‌ పొలిటికల్‌ స్టంట్‌. మొత్తం దేశ పరిస్థితిని అది మారుస్తుందా" అంటూ ప్రశ్నించారు. 
 
ఆయన శనివారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, ఏపీ ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. "నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టత ఇవ్వడంలేదు. ఇస్తామని చెబితే... ఇవ్వండి. లేదంటే... ఇవ్వం అని చెప్పేయండి. తమాషా కాకపోతే ఏమిటిదంతా? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏం చెప్పినా కుండబద్దలు కొట్టినట్లు ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతిరోజూ అక్కడ ప్రజలు, పార్టీలు ఆవేదన చెందడమేమిటి? ఇలా ఉండొచ్చునా? ఇంత గందరగోళం ఏ దేశంలో అయినా ఉంటుందా? అంటూ బీజేపీ పాలకులకు ఆయన ప్రశ్నలు సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments