Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ

Webdunia
గురువారం, 9 జులై 2020 (10:24 IST)
సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీలు)లో 2020-21 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

జూలై 10 నుంచి జూలై 23 వరకు ఆన్ లైనులో దరఖాస్తులు చేసుకోవచ్చ‌ని పేర్కొన్నారు. పేద, అనాథ, బడి బయటి పిల్లలు, డ్రాపౌట్ (మధ్యలో బడి మానేసినవారు) బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణించబడతాయని తెలిపారు.

ఈ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/. వెబ్ సైట్ ద్వారా పొందవ‌చ్చ‌న్నారు. ఎంపికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందించబడుతుందని తెలిపారు.

సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో, సమగ్ర శిక్షా వెబ్ సైట్ (https://ssa.ap.gov.in/SSA/)లోనూ చూసుకోవ‌చ్చ‌న్నారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9494383617, 9441270099 నంబర్లను సంప్రదించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments