Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాన్ని బలుపు అంటారా? కండకావరం అంటారా? బాబునుద్దేశించి కన్నబాబు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (19:38 IST)
రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు నీతి - జాతి లేదు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగారిని అవమానపరచడం, తీవ్ర పదజాలంతో దూషించడాన్ని ప్రజలు క్షమించరని అన్నారు మంత్రి కన్నబాబు. ఇంకా ఆయన మాట్లాడుతూ... నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటనలను చూస్తే.. తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకోవడానికి, వారి పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపడానికి చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రల వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయి. చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్న బూతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల కేవలం వైయస్సార్‌ సీపీలోనే కాదు, ప్రజల్లో కూడా ఆగ్రహం పెల్లుబుకుతోంది. చంద్రబాబు ఎందుకింత దిగజారిపోయారా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. 

 
2- నిన్న ఈ సంఘటనలు ఎందుకు జరిగాయి. ఆ తర్వాత వైయస్సార్‌ సీపీ నుంచి వచ్చిన రియాక్షన్‌ను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కోట్లాదిమంది అభిమానాన్ని పొందిన నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరుగుతున్నాయని మీరు అనుకుంటే, ప్రజాస్వామ విధానాల్లో విమర్శించాలి. కానీ సాక్షాత్తూ ముఖ్యమంత్రిగారిని బోషడికే అని మాట్లాడారు. అది ఎంత తీవ్రమైన పదం అనేది చంద్రబాబుకు తెలియదా?. ఇంత పచ్చిగా, ఈ విధంగా సభ్యత లేని భాషను దేశ రాజకీయాల్లో ఎవరైనా ఉపయోగించారా? ఇదే భాషను తిరిగి మిమ్మల్ని అంటే అది తప్పు అని మీకు అనిపించదా?

 
3- తెలుగులో కొన్ని అనరాని మాటలు ఉన్నాయి. వాటిని ప్రస్తావించకూడదు, ఇటువంటి పదాలు మళ్ళీ ప్రస్తావించవలసి వచ్చినందుకు క్షమించమని కోరుతున్నాను. అంతకన్నా తీవ్రమైన పదజాలాన్ని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడటాన్ని బలుపు అంటారా? కండకావరం అంటారా? ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నారని అనుకోమంటారా?

 
4- మీ పార్టీని బతికించుకోవడం కోసం అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడటం, పైగా దాన్ని సమర్థించుకోవడం సిగ్గుచేటు. తప్పు జరిగింది, మా వాడే ఏదో తెలిసీతెలియక మాట్లాడాడని చంద్రబాబే స్వయంగా క్షమాపణ చెప్పాల్సిందిపోయి, దీన్నొక రాజకీయ అవకాశంగా తీసుకుని రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్టు,  చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.

 
5- చిత్రం ఏంటంటే... చంద్రబాబు నాయుడు... కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కు ఫోన్‌ చేశారట. ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పారట. చంద్రబాబు ఏంటో, ఆయన పద్ధతి, ఆయన బతుకు ఏంటో, ఆయన రాజకీయ వైఖరి ఏంటో అమిత్‌షాకు బాగా తెలుసు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో .. అమిత్‌షా ఏపీ పర్యటనకు వస్తే ప్రొటోకాల్‌, ప్రొటక్షన్‌ ఇవ్వనని, ఆయన కాన్వాయ్‌ మీద రాళ్లు వేయించిన బ్యాచ్‌ ఇది. అమిత్‌ షాకు ఫిర్యాదు చేసినా మీ బతుకు ఏంటో వాళ్లకు బాగా తెలుసు చంద్రబాబు గారూ..

 
6- పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీ రామారావు మీద చెప్పులు, రాళ్ల దాడి చేయించిన ఘనుడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి తన రాజకీయ అవసరాల కోసం పార్టీ ఆఫీసు మీద దాడి చేయించడా? పార్టీ కార్యాలయం మీద మీరే దాడులు చేయించుకుని, మీరే ఏడ్చి, డ్రామాలు ఆడుతున్నారు. - చంద్రబాబు  రహస్యంగా హైదరాబాద్‌ నుంచి తాడేపల్లి వచ్చి కరకట్ట నివాసంలో ఎందుకు దాక్కోవలసి వచ్చింది? పక్కా ప్రణాళికతో మీరే దర్శకత్వం, స్క్రీన్‌ ప్లే వహించి, మీ కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి రోడ్లమీదకు పంపించి ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలే కార్యక్రమాన్ని చేపట్టారు.

 
7- నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్‌ ట్విటర్ లో కూడా పచ్చి భాషను వాడాడు. సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నారు. తండ్రీకొడుకులు ఫ్రస్టేషన్‌లో కూరుకుపోయి పార్టీ క్యాడర్‌కు కాపాడుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం ఈ బూతు డ్రామకు దర్శకత్వం చంద్రబాబే.

 
8- రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు యంత్రాంగం మీద ఉంది. ఈ అలజడిని సృష్టిస్తున్నదే చంద్రబాబు. ఆ దిశగా పోలీసులు విచారణ చేయాలి. ఇటువంటి బూతు భాష మాట్లాడిన వ్యక్తి టీడీపీ అధికార ప్రతినిధి. ఈ మధ్య కాలంలో పట్టాభినే పార్టీని నడుపుతున్నట్లు కనిపిస్తోంది. మొన్న కూడా కాకినాడ వచ్చి అక్కడ డ్రామా చేశాడు. మత్స్యకారులు ఆయనపై దాడికి యత్నించారు. చంద్రబాబు తరపున టీడీపీని పట్టాభి నడుపుతున్నట్టు ఉన్నాడు. చివరకు ఆ పార్టీ ఆ స్థితికి దిగజారిపోయింది

 
9- నిన్నటి నుంచి జరుగుతున్న ఈ సకల వ్యవహారానికి చంద్రబాబు నాయుడే కారణం. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇలాంటి పదాలతో అత్యున్నత పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని వ్యాఖ్యానించడం తగదు. మా పార్టీ నాయకుడు ఓపిగ్గా ఉంటారేమో కానీ, మా పార్టీ క్యాడర్‌, జగన్ గారిని అభిమానించే కోట్ల మంది ప్రజలు ఓపిగ్గా ఉండరు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిపై ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయతతో ఉంటారు. అలాంటి వ్యక్తిని కించపరచడం, వారి కుటుంబంపై విమర్శలు చేస్తూంటే వైయస్సార్‌ సీపీ క్యాడర్‌ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలు ఆపితే మంచిది.

 
చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు
10- చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తారట. దీనికోసమే నిన్నటి నుంచి ఈ ప్రహసనం. వైయస్సార్‌ సీపీని నోటికొచ్చినట్లు తిడితే.. జనం ముందుకు వచ్చి యాక్షన్ చేస్తే..  ఏడ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ దీక్షలు, ధర్నాలు డ్రామాలు చేయాలి, ఇదే చంద్రబాబు ఏకైక ఎజెండా.  చంద్రబాబు దొంగ దీక్షలు, డ్రామాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు. చంద్రబాబు ఎంత దిగజారిపోయారనటానికి నిన్నటి సంఘటనే ఉదాహరణ. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పార్టీ ప్రజల్లో గుండెల్లో స్థానం సంపాదించుకోలేరు.

 
11- ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు భజన బృందాలు, ఆయన తోక  పార్టీలు బయటకు వచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాయి. 2014-19 మధ్య, మీ హయాంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి ఇంటిమీద దాడి చేసిన ఘటన మర్చిపోయారా? ఆ ఇంట్లో మహిళలు, కుటుంబసభ్యులపై పచ్చి బూతులతో దాడి చేస్తే అప్పట్లో మీ నోళ్లు పెగలలేదే? ఇలాంటి పదాలు వాడకూడదు, భాష బాగోలేదని ఒక్కమాట మాట్లాడలేకపోతున్నారే? చంద్రబాబు నాయుడుతో కలిపి అంటకాగడానికి జీవిత కాల ఒప్పందాలు ఉన్నాయా?

 
12- ఇవాళ ఆ భాషను జగన్‌ మోహన్‌ రెడ్డిగారి మీద ప్రయోగించారు. భవిష్యత్‌లో అదే భాషను మీమీద కూడా వాడవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకమని స్వయంగా ఎన్టీ రామారావుగారే సర్టిఫికెట్‌ ఇచ్చారు. దయచేసి ఈ పద్ధతుల్లో రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నాం. వైయస్సార్‌ సీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేవిధంగా, కించపరిచే విధంగా చంద్రబాబు కానీ ఆయన కొడుకు లోకేష్‌ గానీ, వారి నాయకులు మానుకుంటే మంచిది.

 
13- చంద్రబాబు గత కొద్దికాలంగా వైయస్సార్‌ సీపీ ప్రభుత్వంపై ఒక బ్రాండింగ్‌ వేయాలని ప్రయత్నిస్తున్నారు. అరాచక పాలన జరుగుతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. 2014-19 మధ్య ఏ ఒక్క వర్గాన్ని అయినా చంద్రబాబు సుఖంగా ఉండనిచ్చారా? ఇవాళ ప్రజలంతా సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేక ముఖ్యమంత్రిగారిని దూషిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు భవిష్యత్‌లో ఇటువంటి అనుచితమైన భాషను వాడమని, కార్యకర్తలను అదుపులో పెట్టుకుంటామని భేషరతుగా క్షమాపణ చెప్పాలని వైయస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది.
 

 
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏమన్నారంటే..

 
1- ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన  సంఘటనలను సమాజం తీవ్రంగా పరిగణిస్తుంది. టీడీపీ ఆఫీసుల మీద దాడులు జరిగినట్టు, అది చాలా ఘోరమైన అంశంగా చిత్రీకరించేందుకు టీడీపీ, వారి తోక పార్టీలు, వారికి వత్తాసు పలికే ఓ వర్గం మీడియా ఒక కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనల నుంచి సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.  

 
2. వాస్తవానికి నిన్న ఏం జరిగిందో క్షుణ్ణంగా పరిశీలిస్తే..  యాక్షన్ కు రియాక్షన్ గా మాత్రమే జరిగింది. ముఖ్యమంత్రి జగన్ గారికి ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో కడుపుమండినవారు తిరగడ్డారు. చంద్రబాబు చేయించినది చర్య అయితే.. జగనన్న అభిమానులు తిరగబడటం కేవలం ప్రతిచర్య. మొదటిది లేకపోతే.. అంటే బూతులు తిట్టించకపోతే, ప్రతి చర్యకు అవకాశమే లేదు. ఈ విషయం టీవీలు చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది. 
 
- మహారాష్ట్రలో కేంద్రమంత్రి నారాయణ్ రాణే చెప్పుతో కొడతానని రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే.. ఏం జరిగిందో మీకు తెలుసు. 
- టీడీపీ నాయకుల బూతులు, దారుణమైన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపైన, ఒక పార్టీ అధ్యక్షుడిపైన చేసిన కామెంట్లు.. సహజంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిస్పందనలకు దారితీశాయి. 
- చంద్రబాబు నాయుడు మాదిరిగా,  జగన్ మోహన్ రెడ్డిగారు వెన్నుపోటు పొడిచో, కుట్రలు పన్నో, అడ్డదారిలోనో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కాదు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు గెలుచుకుని,  ఇప్పటికీ చెక్కు చెదరని ప్రజాభిమానంతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ గారు. 

 
3. రెండున్నరేళ్ళుగా అద్భుతమైన పరిపాలన సాగిస్తూ, తన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో  చిరస్థాయిగా నిలుస్తోన్న ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతారా..?  బోషడీకే, వెధవ, సన్నాసి అన్న మాటలను చంద్రబాబు ఖండించకుండా, ఇంకా సమర్థిస్తున్నారా..? ఇలాంటి పదజాలాన్ని ఎందుకు చంద్రబాబు మాట్లాడిస్తున్నారు..?
చీమ చీమ ఎందుకు కుట్టావ్.. అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు.. టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడితే, రెచ్చగొడితే.. ఎవరైనా ఊరుకుంటారా..  కొంతమంది ఆవేశపరులో, మరొకరో.. లేక వారి కుట్రదారులో.. ఎవరో దాడి చేసి ఉంటారు. ఎవరు దాడి చేశారు అన్నది పోలీసు విచారణలో తేలుతుంది. 

 
4. రాష్ట్ర డీజీపీ  గురించి చంద్రబాబు ఏం మాట్లాడిస్తున్నారు. పోలీసు బాసును పట్టుకుని పాలేరు అని మాట్లాడతారా..? డీజీపీ సవాంగ్ గారు మీ హయాంలో కూడా విజయవాడ సీపీగా పనిచేశారు కదా.. అటువంటి డీజీపీని పట్టుకుని ఏరా అని, పాలేరు అని మాట్లాడతారా..? మొన్నటికి మొన్న టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఐపీఎస్ అధికారులను "ఎస్పీ నా కొడుకులు వచ్చి సలాం చేసేవారు" అని మాట్లాడారు. టీడీపీ నేతల భాష చూస్తే ఎవరికైనా అసహ్యం వేస్తుంది.  ఎవరికి ఎవరూ పాలేరులు కాదు. - నోరు పెద్దది అయినప్పుడు మూతి మీద వాత పెట్టే కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నారు. అదే ఈరోజు జరుగుతుంది. 

 
5- చేయాల్సిందంతా చేసి.. చంద్రబాబు దీక్ష చేస్తాడట.  కొంగ జపం ఎందుకు చేస్తున్నావు చంద్రబాబూ...?. దీనినిబట్టే, మీ కుట్ర రాజకీయం బయట పడటం లేదా..? బూతులు తిట్టించి, ప్రజలను రెచ్చగొట్టి, అందులో నుంచి ఏదో సానుభూతి పొందాలని మీరు  కుట్రలు చేస్తున్నట్లు ప్రజలకు అర్థం కావడం లేదా. ఇటువంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించి,  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై బురదజల్లాలనుకుంటే అది సాధ్యం కాదు. ఈ రాష్ట్రానికి అద్భుతమైన పరిపాలన అందిస్తోన్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు.  సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండమైన విజయాలను అందించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా టీడీపీ ముందుకు రాని పరిస్థితి. 

 
6. 36 గంటలు కాకపోతే.. 360 రోజులు నిరాహార దీక్ష చేయండి. ఏం చేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు. గుంట నక్క రాజకీయాలను ప్రజలు హర్షించరు. చంద్రబాబు అధికారంలోకి ఎలా వచ్చారు.. ? ఆ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్ని మర్డర్లు చేశారు..? ఎన్ని బస్సులు తగులబెట్టించారు..? ఇదంతా చంద్రబాబు చరిత్ర కాదా..?. ఈరోజు కొంగ జపాలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు గాక నమ్మరు. 

 
7. ఇప్పటికైనా చంద్రబాబుకు ఒక విషయం స్పష్టంగా తెలియాలి. "తప్పుగా మాట్లాడించకూడదు. మాట్లాడిస్తే ప్రజలు ఊరుకోరు. తిరగబడతారు" అని చంద్రబాబు తెలుసుకోవాలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికొచ్చినట్లు తిట్టడానికే మీ అనుభవం అంతా ఉపయోగిస్తున్నారా బాబూ..?

 
8. టీడీపీ కార్యాలయం ప్రజాస్వామ్య దేవాలయం కాదు.. కుట్రలకు, కుతంత్రాలకు, వెన్నుపోట్లకు వేదిక. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నక్క జిత్తులు పన్నినా..  చంద్రబాబుకు, లోకేష్ కు చివరికి మిగిలేది బూడిదే. కుళ్ళు, కుతంత్రాలతో రాజకీయాలు చేసే వారికి ఆఖరికి అదే మిగులుతుంది. చంద్రబాబును  సపోర్ట్ చేస్తున్న తోక పార్టీలు, కొంతమంది నాయకులు.. చంద్రబాబు తిట్టించింది తప్పు అని మాట్లాడి, ఆ తర్వాత సపోర్ట్ చేయండి. ఇది సరైన విధానం కాదు. 

 
9. మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవర్నో కూర్చోబెట్టి, వారికి కీ ఇచ్చి, బూతులు మాట్లాడిస్తే.. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిగారిని, డీజీపీని, రాష్ట్ర ప్రజలను డీమోరలైజ్ చేస్తుంటే.. వ్యవస్థలు చూస్తూ ఊరుకోవు. 
- ఈరోజు చంద్రబాబును సపోర్ట్ చేస్తున్న ఇతర పార్టీల నేతలకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాం. 
-  రేపు మిమ్మల్ని కూడా టీడీపీ నాయకులు ఇలానే తిడతారు.  ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిపై అన్న మాటలు.. ఇక్కడితే ఆగిపోవు.. రాజ్యాంగ పదవులైన జడ్జిలపైనా, ప్రధానమంత్రిపైనా, రాష్ట్రపతిపైనా.. చివరకు మీ పైన కూడా మాట్లాడతారు. 
- అసలు ఇలాంటి మాటలను ప్రజాస్వామ్యంలో మాట్లాడటం కరెక్టేనా అని అంతా ఆలోచించాలి. 

 
10. చంద్రబాబు 36 గంటలు నిరాహార దీక్ష చేస్తుంటే.. ఆయన  చేసిన ఘోరాలు-నేరాలు గురించి ఆ 36 గంటలూ ప్రజలు మాట్లాడుకుంటారు. టీడీపీకి సింపథీ వస్తుందనుకుంటే పొరపాటు, ఆఖరికి చంద్రబాబు, వారి పార్టీనే అభాసుపాలవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments