Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’... ఉపాధి కల్పిస్తానంటే పేరు మార్చుతా.. కంచ ఐలయ్య

ప్రముఖ రచయిత, ఆచార్య కంచ ఐలయ్య తాను రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం పేరు మార్చుపై స్పందించారు. తాను పెట్టిన షరతులకు అంగీకరిస్తే తన పుస్తకం పేరు మార్చుకుంటానని చెప్పారు.

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (09:34 IST)
ప్రముఖ రచయిత, ఆచార్య కంచ ఐలయ్య తాను రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం పేరు మార్చుపై స్పందించారు. తాను పెట్టిన షరతులకు అంగీకరిస్తే తన పుస్తకం పేరు మార్చుకుంటానని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు కొత్తగా చేపట్టే సామాజిక సేవలపై త్వరలో పుస్తకం రాయనున్నట్టు తెలిపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఆర్యవైశ్య సమాజం దళిత, గిరిజన, చాకలి, మంగలి సామాజిక వర్గాల వారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలన్నారు. 
 
తెలుగు రాష్ట్రాలకు చెందిన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు, ఇరు రాష్ట్రాల ఆర్యవైశ్య ముఖ్యప్రతినిధులు చర్చించి ఒక ప్రతిపాదన చేయాలని అప్పుడే తాను వారి సామాజిక సేవలపై పుస్తకం రాస్తానని ప్రకటించారు. 
 
తాను రాసిన పుస్తకాన్ని నిషేధించాలని, శీర్షిక మార్చాలని ఆర్యవైశ్య సంఘాలు తన దిష్టిబొమ్మలు దహనం చేయడం, పోలీసులకు ఫిర్యాదులు చేయడం సరి కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో తనకు ప్రాణహాని లేదని కేవలం ఆర్యవైశ్య సామాజిక వర్గంతోనే ఉందని చెప్పారు.  

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments