Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలాంటి వారు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందే... ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రపంచంలో ఉన్న గొప్ప నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలనేది ఏపీ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. దీనిలో భాగంగా అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ కట్టడాలుగా గుర్తింపు పొందాలనేది ఉద్దేశంతో నిర్మాణాలు చేపడుతున్నామన్నారు.

Advertiesment
అలాంటి వారు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందే... ముఖ్యమంత్రి చంద్రబాబు
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (14:00 IST)
ప్రపంచంలో ఉన్న గొప్ప నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలనేది ఏపీ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. దీనిలో భాగంగా అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ కట్టడాలుగా గుర్తింపు పొందాలనేది ఉద్దేశంతో నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాజధాని ప్రాంతంలో 13 మెడికల్ కాలేజీలతో పాటు ప్రఖ్యాత ఇంజనీరింగ్ సంస్థలు కూడా ఏర్పాటుకు ముందుకొచ్చాయన్నారు. రాజధాని నిర్మాణ కమిటీలో ఎందరో ప్రముఖులు ఉన్నారన్నారు. 
 
రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోడానికి ప్రతిపక్ష వైఎస్ఆర్‌సిపి బరితెగించి, ఎన్నో కుట్రలు పన్నిందన్నారు. ఇప్పుడు ఎనలేని ప్రేమ చూపుతూ, రాజధాని నిర్మాణం అలస్యమవుతోందంటూ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణం ప్రతిపక్ష పార్టీ కోసం కాదని, భవిష్యత్తు తరాల కోసమని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు కావాల్సింది సుపరిపాలన, అభివృద్ధి మాత్రమేనన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు చెంపలేసుకుని, రాజధాని నిర్మాణానికి సహకరించాలని హితవు పలికారు. 80 శాతం మేర ప్రజల సంతృప్తి పొందాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మోసాలు చేసి సంపాదించే వారిని సహించేది లేదన్నారు. అటువంటి వారందరూ రాష్ట్రం వదలిపోవాల్సిందేన్నారు. 
 
పర్యాటానికి  పెద్దపీట...
రాష్ట్రంలో పర్యాటానికి పెద్దపీట వేస్తునట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రంలో సుదీర్ఘ సముద్రం తీరం, చారిత్రిక కట్టడాలతో పాటు పోలవరం, పాపికొండలు, అరకు వంటి ప్రాంతాలు ప్రకృతి అందాలకు కూడా కొదవలేదన్నారు. విశాఖపట్నం, తిరుపతి, కడప దర్గా, పుటపర్తి, విజయవాడ, రాజమండ్రిల్లో ఉన్న దేవాలయాలతో ఆధ్యాత్మికతకు రాష్ట్రం కేంద్ర బింధువుగా ఉందన్నారు. కూచిపూడి వంటి సాంస్కృతిక కళారూపాలు కూడా ఉన్నాయన్నారు. 
 
వీటితో నోరూరించే రుచులతో ఆహారం ఏర్పాటుచేస్తే పర్యాటకలకు రాష్ట్రం సర్వధామంగా మారుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్ల రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో హాస్సాటిలాటీ యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. త్వరలో రాజధాని ప్రాంతంలో 240 గదులతో నోవాటెల్ హోటల్ ఏర్పాటుకు ఆ హోటల్ యాజమాన్యం ముందుకొచ్చిందన్నారు.
 
మన క్రీడాకారులు దేశానికి గర్వకారణం...
ఇటీవల జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టంగ్  పోటీల్లో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రానికి చెందిన 20 మంది క్రీడాకారులు వివిధ క్రీడల్లో రాణిస్తూ, రాష్ట్రానికి, దేశానికి పేరు తెస్తున్నారన్నారు. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టంగ్ పోటీల్లో పతకాలు సాధించిన విజయనగర జిల్లా కొండవెలగాడు గ్రామానికి చెందిన సంతోషితో గుంటూరు జిల్లాకు చెందిన అన్నదమ్ములు రాగల వరుణ్, రాహుల్‌ను సత్కరించి, చెరో రూ.10 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహం ప్రకటించారు. 
 
వరుణ్, రాహుల్‌కు కోచ్‌గా వ్యవహరించిన మాణిక్యాలరావుకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. అన్నదమ్ములైన వరుణ్, రాహుల్ తండ్రికి రెండు ఎకరాల అందివ్వనున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి కూడా సహకరిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ చూపేవిధంగా శిక్షణకు అవసరమైన సౌకర్యాలతో కోచ్‌లను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు రాహుల్, వరుణ్, సంతోషి మాట్లాడుతూ, సీఎం ద్రబాబు నాయుడు సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో భవిష్యత్తులో అంతర్జాయతీ స్థాయిలో పతకాలు సాధించి, రాష్ట్రానికి, దేశానికి మందచి పేరుతెస్తామన్నారు.
 
ఈ సమావేశంలో మంత్రులు దేవినేని ఉమమహేశ్వరరావు, నారాయణ, కొల్లు రవీంద్ర, భూమన అఖిల ప్రియ, నక్కా ఆనందబాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, శశిభూషణ్ కుమార్, ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిమ్ జాంగ్.. జపాన్ ప్రజలను ఎలా పరిగెత్తించేలా చేశాడో తెలుసా?