మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (10:35 IST)
వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైవున్న కేసుల్లో ఓ కేసులో మాత్రం బెయిల్ లభించింది. మరో రెండు కేసుల్లో మాత్రం రిమాండ్, కస్టడీని ఎదుర్కొంటున్నారు. అలాగే ఓ కేసులో ఆయనను రెండు రోజుల పాటుు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
సర్వేపల్లి రిజర్వాయరులో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో రెండో అదనపు మేజిస్ట్రేట్ శారదా రెడ్డి శుక్రవారం కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అయితే, కనుపూరు చెరువులో మట్టి తవ్వి లే ఔట్లకు విక్రయించిన కేసులో మాత్రం నెల్లూరు అదనపు మేజిస్ట్రేట్ నిషాద్ షేక్ మాత్రం కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్ర్రస్తుతం కాకాణి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, 2022లో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్‍‌గేట్ ఏర్పాటు చేసిన కేసులో రెండు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి జూలై  ఒకటో తేదీ సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపి, తిరిగి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments