Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెపై కన్ను.. పెళ్లికి పట్టుబట్టి బుక్కయ్యాడు...

కామం మనిషిని ఎంత నీచానికైనా దిగజార్చుతుంది. అందుకు ఇది ఓ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడు చివరకు ఆమె కుమార్తెను బలవంతంగా పెళ్లి చేసుకుని ఇపుడు జైలు ఊచలు లెక్

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:48 IST)
కామం మనిషిని ఎంత నీచానికైనా దిగజార్చుతుంది. అందుకు ఇది ఓ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడు చివరకు ఆమె కుమార్తెను బలవంతంగా పెళ్లి చేసుకుని ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. కడప జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కడప జిల్లాకు చెందిన ఓ మహిళ పదేళ్ళ క్రితం గల్ఫ్‌కు వెళ్లింది. ఆ సమయంలో 11 నెలల కుమార్తెను తన తల్లిదండ్రుల వద్ద వదిలివెళ్లింది. గల్ఫ్‌లో రెడ్డయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అనంతరం వారిమధ్య జరిగే మాటల సంభాషణల్లో తనకు 14 యేళ్ల కుమార్తె ఉన్నట్టు ఆమె చెప్పింది. దీంతో రెడ్డయ్య ఆ బాలికపై కన్నేశాడు. మహిళకు రూ.10 లక్షల డబ్బు ఆశ చూపించాడు. దీంతో రెడ్డయ్యకు కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు సమ్మతించింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కడపకు వచ్చారు. 
 
ఇంటికి వచ్చినప్పటి నుంచి రెడ్డయ్యను పెళ్లి చేసుకోవాలని కుమార్తెను తల్లి బలవంతం చేయసాగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తాను పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పింది. దీంతో తల్లి ఆమెను చిత్రహింసలకు గురిచేసింది. అయినా మాట వినకపోవడంతో గత నెల 29న బాలికను సుండుపల్లెకు తీసుకెళ్లి ఓ ఇంట్లో నిర్బంధించి రెడ్డయ్యతో ఆమెకు బలవంతంగా పెళ్లి చేసింది.
 
విషయం తెలిసిన కొందరు వ్యక్తులు కడప మహిళా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు రంగంలోకి దిగి బాలికను రక్షించారు. బాలిక తల్లి, తండ్రితోపాటు రెడ్డయ్య, నాగరాజు అనే మరో వ్యక్తిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments