దీప కాంతులతో ప్రకాశించిన లోవ తలుపులమ్మ దేవస్థానం

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:23 IST)
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ తలుపులమ్మ అమ్మవారి  దేవస్థానం దీప కాంతులతో ప్రకాశించింది. తలుపులమ్మ దేవస్థానంలో పంచలోహాల విగ్రహాల మండపం వద్ద దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలవిరాట్టుకు వేద పండితులు వేదోక్తంగా  పూజలు నిర్వహించి, అమ్మవారికి ప్రీతి పాత్రులయ్యారు. అనంతరం ఓం, స్వస్తిక్ ,పద్మం, శివలింగాకారం, రూపాల్లో భక్తులు  జ్యోతులను ప్రజ్వలన చేశారు. 
 
 
శివలింగాకారం జ్యోతులను ప్రజ్వలింపజేసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని సాక్షాత్కరించారు.  ఈ దీపోత్సవ కార్యక్రమం లో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి అమ్మవారి పట్ల తమ భక్త ప్రవక్తలను చాటుకున్నారు. ఈ దీపోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. అమ్మవారిని భక్తులు కనులారా దర్శించుకుని తన్మయులయ్యారు. అనంతరం దూప దీప నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. భ‌క్తులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments