Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ పి.ఆర్.ఓ., నిర్మాత మహేష్ కోనేరు మృతి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (12:03 IST)
జూనియ‌ర్ ఎన్టీయార్ కు చేదోడు వాదాడుగా ఉంటూ, ఆయ‌న సినిమాల కోసం పి.ఆర్.ఓ. గా, ఆయ‌న‌కు మేనేజ‌ర్ గా  ప‌నిచేసిన ప్ర‌ముఖ నిర్మాత మ‌హేష్ కోనేరు మృతి చెందారు. ఈ ఉద‌యం విశాఖపట్నంలో ఆయ‌న‌ గుండెపోటుతో మృతి చెందారు. యువ‌కుడే అయిన మ‌హేష్ మృతిని ఎవ‌రూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయ‌న‌కు గుండె పోటు రావడం ఏంట‌ని విషాదం వ్య‌క్తం చేస్తున్నారు.
 
జూనియ‌ర్ ఎన్టీయార్ కు మేనేజర్ గా ప‌నిచేస్తూ, మ‌హేష్ ప్రొడ‌క్ష‌న్ ఫీల్డ్ లో కూడా ప్ర‌వేశించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరిట సంస్థ‌ను స్థాపించి, కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. అంతేకాదు చాలా సినిమాల‌ను డిస్ట్రిబ్యూష‌న్ కూడా చేశారు. ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు గుండెపోటుతో మృతి చెందిన వార్త ఈ ఉద‌యం దావాన‌లంలా సినీ వ‌ర్గాల‌లో వ్యాపించింది.

ఆయన చాలా ఏళ్ల నుంచి ఎన్టీయార్ కు మేనేజర్ గా పనిచేస్తున్నారు. పలు సినిమాలకు మహేష్ డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి, 118, మిస్ ఇండియా, తిమ్మరుసు వంటి చిత్రాలు నిర్మించారు. ఇవాళ ఉదయం విశాఖపట్నంలో గుండెపోటుతో చికిత్స పొందుతూ మ‌హేష్ మృతి చెందడం ఇండస్ట్రీలో అందరికీ షాక్ గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments