Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌పై ఆర్ఆర్ఆర్ కామెంట్స్.. ఫ్యాన్స్ సపోర్ట్ కోల్పోతారు..

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (17:25 IST)
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలతో కొత్త చర్చకు దారి తీశాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రజాదరణ బాగా ఉందని.. బీజేపీ కోసం ఆయన సేవలు వినియోగించుకుంటామని చెప్పుకొచ్చారు. ఏపీలో టీడీపీతో తమ విధానం మారలేదన్నారు. జనసేన మిత్రపక్షంగా ఉంటుందంటూ వివరించారు. 
 
అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా పని చేసే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. అటువంటి నిర్ణయాలో కొన్ని వర్గాలతో పాటుగా అభిమానుల మద్దతు పోగొట్టుకుంటారని వ్యాఖ్యానించారు. 
 
జూనియర్‌కు రాజకీయంగా ఆసక్తి ఉంటే 20 ఏళ్ల తరువాత మాత్రమే టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్‌కు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అటు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మాత్రం జూనియర్ సేవలు వినియోగించుకొనేందుకే అమిత్ షా నేరుగా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments