Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భుత్వ విప్ కి జ‌ర్న‌లిస్టుల‌ స‌మ‌స్య‌ల్ని నివేదించిన ఏపీబీజేఏ

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (11:46 IST)
ప్రభుత్వ విప్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును ఏపీబీజేఏ నాయ‌కుడు ప‌ఠాన్ మీరా హుస్సేన్ ఖాన్ బృందం క‌లిసింది. ఏపీలో జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్ని ఆయ‌న‌కు నివేదించింది. క‌రోనా క‌ష్ట కాలంలో ప్రంట్ లైన్ వారియ‌ర్స్ లా జ‌ర్న‌లిస్టులు త‌మ ఆరోగ్యాల్ని పణంగా పెట్టి వార్తా సేక‌ర‌ణ చేస్తున్నార‌ని జ‌ర్న‌లిస్టు నేత మీరా హుస్సేన్ ఉద‌య‌భానుకు వివ‌రించారు. ఏపీలో జ‌ర్న‌లిస్టుల‌కు పూర్తి స్థాయిలో అక్రిడిటేష‌న్ ఇవ్వాల‌ని, చిన్న ప‌త్రిక‌ల‌కు ఎటువంటి తీవ్ర ఆంక్ష‌లు లేకుండా గుర్తింపు ఇచ్చేలా ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేయాల‌ని ప్ర‌భుత్వ విప్ సామినేని ఉద‌య భానును మీరా హుస్సేన్ కోరారు. 
ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును ఆయ‌న స్వ‌గృహంలో క‌లిసిన ఏపీబీజేఏ నాయ‌కుడు ప‌ఠాన్ మీరా హుస్సేన్ ఖాన్ బృందం ఆయ‌న్ని ఘ‌నంగా శాలువా క‌ప్పి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఉద‌య‌భాను స‌తీమ‌ణి, విమలభానును కూడా మర్యాద పూర్వకంగా కలిసిన జర్నలిస్టు సంఘ రాష్ట్ర నాయకులు పి.మీరాహుస్సేన్ ఖాన్ బృందం ఆమెను కూడా శాలువాతో స‌త్క‌రించి, పుష్పగుచ్చాలు అందజేసి చిరుసత్కారం చేశారు. ఉదయభానుకి మీరాహుస్సేన్  స్వీట్లు తినిపించారు. జ‌ర్న‌లిస్టుల సమస్యలను తెలియజేయ‌గా, తాను ప్ర‌భుత్వ విప్ గా జ‌ర్న‌లిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఉద‌య భాను హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పఠాన్ సైదాఖాన్, న్యాయవాది పఠాన్ కరీముల్లా, అల్లావుద్దీన్. నరేంద్రనాయక్, ఎలిషా తదితరులు పాల్లొన్నారు.

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments