హవ్వ... మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఎంత మాటన్నారు?

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (19:13 IST)
వైసిపి-జనసేన పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుకుంది. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై జనసేనాని తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ఫైర్ అవ్వడంతో అది కాస్త రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. పవన్ కళ్యాణ్‌ను వైసిపి నేతలు ముఖ్యంగా మంత్రులు టార్గెట్ చేస్తే తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు. 
 
దీనికి ధీటుగా జనసేనపార్టీ నేతలు విమర్సల వర్షం కురిపిస్తున్నారు. విజయవాడ వేదికగా నిన్న మహేష్ తీవ్రస్థాయిలో విమర్సలు చేస్తే ఈరోజు తిరుపతిలో రాష్ట్ర నాయకులు కిరణ్ రాయల్ కూడా మంత్రులపై ఫైరయ్యారు.
 
ఒక్కో మంత్రి గురించి విపులంగా వివరిస్తూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో కిరణ్‌ రాయల్ ఏం  మాట్లాడారంటే.. మెగా కుటుంబాన్ని జగన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సినీ ప్రముఖులు సమర్థిస్తుంటే వైసిపి నేతలకు ఎందుకు కోపమంటూ ప్రశ్నించారు.
 
వెల్లంపల్లి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని గతంలో సీటు తెచ్చుకున్న వ్యక్తని.. అసలు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ మాత్రమేనన్నారు. పేర్నినాని సంకర జాతి వ్యక్తి అంటూ మండిపడ్డ కిరణ్ రాయల్.. మంత్రి పదవి పోకుండా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ పైన పేర్ని నాని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 
 
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆయన ఓ బ్రోకర్ అంటూ ఆరోపించారు. ఈ మంత్రులందరినీ స్వరూపానందేంద్ర స్వామి దగ్గరకు తీసుకెళ్ళి తాయత్తులు కట్టించాలని ముఖ్యమంత్రికి సూచించారు కిరణ్ రాయల్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments