Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న విద్యా కానుక.. విద్యార్థులకు యూనిఫారాలు, బూట్లు, సాక్సులు

Webdunia
బుధవారం, 6 జులై 2022 (17:34 IST)
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ర్నూలు జిల్లా ఆదోనిలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌నన్న విద్యా కానుక‌ కింద ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు కిట్ల‌ను జ‌గ‌న్ అందించారు. జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల యూనిఫారాలు (క్లాత్‌), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు ఉంటాయి. 
 
ఇంకా బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్ ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అన్నింటినీ బ్యాగులో పెట్టి, పిల్ల‌ల‌కు అందిస్తారు. మంగ‌ళ‌వారం ఈ కిట్ల పంపిణీని ప్రారంభించిన సీఎం పిల్ల‌ల‌కు ఇచ్చే ఓ బ్యాగును భుజానికేసుకుని ఫోటోల‌కు ఫోజిచ్చారు.
 
ఇక ఈ కార్య‌క్ర‌మంలో క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. ప్రైవేట్ విద్యా సంస్థ‌ల‌తో పాటు ప‌లు వ్యాపారాలు క‌లిగిన బుట్టా రేణుక‌... 2014 ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా వైసీపీలో చేరి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ క‌ర్నూలు ఎంపీ టికెట్‌ను సాధించారు. 
 
ఎన్నిక‌ల్లో విజ‌యం కూడా సాధించారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ విప‌క్షానికి ప‌రిమితం కావ‌డంతో రేణుక టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితిని అంచ‌నా వేసి తిరిగి వైసీపీ గూటికే చేరారు. 
 
అయితే పార్టీ కష్టాల్లో ఉన్న స‌మయంలో పార్టీని వీడిన వారికి టికెట్లు ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్ చెప్పినా, సీటు ద‌క్క‌కున్నా ఫ‌రవా లేదు గానీ, పార్టీలోకి అయితే వ‌స్తానంటూ ఆమె వైసీపీలో చేరిపోయారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments