Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌ 1న వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ప్రారంభం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:25 IST)
ఏప్రిల్‌ 1న వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో 500 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 
 
గర్భిణులు, బాలింతలకు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా 500 వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు.
 
2016లో ప్రారంభమైన 'తల్లీబిడ్డ' ఎక్స్‌ప్రెస్‌ పథకం నిర్వహణ సంస్థ మూడేళ్ల కాలపరిమితి ఎప్పుడో ముగిసింది. మరో సంస్థను ఎంపిక చేయడంలో ఏళ్ల తరబడి జాప్యం జరిగింది. టెండరు ద్వారా కొత్తగా ఎంపిక చేసిన ఓ సంస్థ ఈ ఏడాది మార్చి నుంచి సేవలను కొనసాగించాల్సి ఉంది. 
 
ప్రస్తుతం వాడుకలో ఉన్న మారుతి వాహనాల ద్వారా కాకుండా స్పోర్ట్స్‌ యుటిలిటీ, మిడ్‌ లెవల్‌ యుటిలిటీ స్థాయి వాహనాల ద్వారా బాలింతలను పంపించాలని ప్రభుత్వం షరతు విధించింది. 
 
అయితే అర్హత సాధించిన సంస్థ చూపించిన వాహనాలు, వాటిలోని సౌకర్యాలు ప్రమాణాలకు తగ్గట్లు లేనందున అధికారులు అంగీకరించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments