సంసారం చేయాలన్నా J- ట్యాక్స్ కట్టాలా? చంద్రబాబు ప్రశ్న

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆయన ఆరోపించారు. అదేసమయంలో జగన్ పాలనపై చంద్రబాబు సంధించిన సెటైర్లు నవ్వులు తెప్పించాయి. 
 
ఆయన బుధవారం ఆయన గంటూరులో విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ హయాంలో చేసిన పనులు ఆదర్శవంతంగా ఉన్నాయని, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశామని, మురుగు కాల్వలు కట్టించామని, శ్మశానాలు ఏర్పాటు చేశామని, ఏడు లక్షల పంటగుంటలు తవ్వామని గుర్తుచేశారు. 
 
ఆ పంట గుంటలకు ఈ ఏడాదిలో పదిసార్లు నీళ్లొచ్చాయని, తద్వారా భూగర్భజలాలు పెరిగి కరవు తీరిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏదో చేసిందని వాళ్ల నాయకులు చెప్పుకుంటున్నారని, ఇంత వరకూ ఒక తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు. ఇరిగేషన్‌కు సంబంధించి ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని మండిపడ్డారు. 
 
ఎవరి పొలంలో వాళ్లు మట్టి తీసుకోవాలంటే అధికారుల అనుమతి కావాలా? అందుకు మైనింగ్ శాఖకు డబ్బుల కట్టాలా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. పైగా, 'J- ట్యాక్స్.. జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ కట్టాలా! రేపు భార్యాభర్తలు కాపురం చేయాలన్నా J-ట్యాక్స్ కట్టే పరిస్థితి వస్తుంది' అంటూ జగన్ పాలనపై సెటైర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments