Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ఫ్లై ఓవర్ ప్రమాదం.. కూబ్రాకు జగన్ సాయం..

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (15:43 IST)
హైదరాబాద్ బయోడైవర్శిటీ ఫ్లైఓవర్ వద్ద నవంబర్ 23వ తేదీన జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదం తర్వాత కుబ్రా బేగం అనే యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుబ్రా బేగంకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఇంకా ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. వృత్తిరీత్యా చిత్రకారుడు అయిన కుబ్రా బేగం తండ్రి అబ్దుల్ అజీమ్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
సాయం కోసం వేచి చూస్తున్న తరుణంలో సాక్షి న్యూస్‌లో వార్తలను చూసిన ఒక విలేకరి వెంటనే ఆపరేషన్ ఖర్చు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. కొద్ది నిమిషాల్లో, ట్వీట్‌కు ముఖ్యమంత్రి స్పందిస్తూ, శస్త్రచికిత్సకు నిధులు సమకూర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు, గాయపడిన మహిళ కోలుకున్న తర్వాత ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు.
 
ఈ శుభవార్త అందుకున్న కూబ్రా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తె, కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందుకు రావడంపై కూబ్రా తల్లిదండ్రులు షాకయ్యారు. ఇక పరిస్థితిపై వెంటనే స్పందించిన జగన్ మోహన్ రెడ్డికి కూడా విలేకరి కృతజ్ఞతలు తెలిపారు.
 
కాగా నవంబర్ 23న, వేగంగా ప్రయాణిస్తున్న కారు ఫ్లైఓవర్ నుండి ఎగురుతూ వచ్చి హైదరాబాద్‌లోని రోడ్డుపైకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఒక పాదచారుడు మరణించగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతం చుట్టూ ఉన్న సిసిటివి కెమెరాలు వేగంగా కారు ప్రమాదానికి గురైన క్షణాలను బంధించాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments