Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాయలసీమ వెనుకబాటు.. జగన్ గురించి 75వ పేజీలో ఏముందంటే?

రాయలసీమ వెనుకబాటు.. జగన్ గురించి 75వ పేజీలో ఏముందంటే?
, సోమవారం, 25 నవంబరు 2019 (10:52 IST)
ఏపీ సీఎం, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాయలసీమ వెనుకుబాటుకు కారణాలు చూపుతూ 1996లో పౌరహక్కులు వారు ప్రచురించిన ‘కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం’ అన్న పుస్తకం గురించి పవన్ ప్రస్తావించారు. 
 
"ఈ పుస్తకంలో, అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి, వలసలు వెళ్లిపోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది." అంటూ పవన్ ట్వీట్ చేశారు. అంతే కాదు... ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుందని పవన్ మరో ట్వీట్ చేశారు. 
 
కాగా.. జగన్ పాలనను ఎండగడుతూ.. పవన్ రోజుకో ట్వీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ ఆరు నెలల పాలనపై కూడా పవన్ సంచలన ట్వీట్ చేశారు. గడిచిన ఆరునెలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు పవన్ కల్యాణ్. కేవలం విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. అనంతరం ఆ ఆరు పదాలకు ఒక్కో ట్వీట్ చేస్తూ వివరణ కూడా ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనావాసాల్లో కుప్పకూలిన విమానం, 23మంది మృతి