Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌..నయా తుగ్లక్‌: చంద్రబాబు

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (05:52 IST)
జగన్‌..నయా తుగ్లక్‌ అని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతికి మద్దతుగా తెనాలిలోని వీఎస్ ఆర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ… ప్రజావేదిక కూల్చి జగన్ విధ్వంసానికి శ్రీకారం చుట్టారన్నారు.

తాను పిలుపు ఇస్తే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. ఓ వ్యక్తిపై కోపంతో రాజధాని మార్చడం సరికాదని జాతీయ మీడియా అంతా ఖండించిందన్నారు. మన తుగ్లక్‌కు ఇంకా జ్ఞనోదయం కాలేదన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు సామాజిక స్పృహ లేదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధానిపై వైసీపీ ఎంపీని నిలదీశారని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని అన్నారు. జగన్‌ వడ్డీతో సహ చెల్లించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారు..చిల్లర రౌడీలు జేఏసీ టెంట్ కాల్చుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. బోస్టన్ కమిటీ భోగస్ కమిటీ అని అన్నారు. తాము అడ్డుకుంటే జగన్‌ రాష్ట్రంలో తిరిగేవారా? అని  ప్రశ్నించారు.

తాము తలుచుకుంటే మీరు ఎక్కడ ఉండేవారని వైసీపీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. ముద్దులు పెట్టుకుంటూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు.

ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే..వైసీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై అమరావతి అంటే విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments