Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ జైలుకు వెళ్లక తప్పదు: పట్టాభిరామ్

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి జైలుకు వెళతారని టీడీపీ నేత అట్టాభిరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

దీనిపై స్పందించిన పట్టాభిరామ్ మాట్లాడుతూ జగన్ బెయిల్ రద్దు విషయంలో సీబీఐ న్యాయస్థానం నిర్ణయానికే వదిలేసిందని, పిటిషన్ మెరిట్స్‌ ఆధారంగా గౌరవ కోర్టు నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోరిందన్నారు. 

జగన్మోహన్ రెడ్డి కుంటి సాకులు చెబుతూ గత 7,8 ఏళ్లుగా విచారణకు సహకరించకుండా, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని పట్టాభిరామ్ విమర్శించారు. జగన్ బెయిల్‌పై బయట తిరుగుతూ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

రూ. 43వేల కోట్లు స్కామ్‌కు సంబంధించి సీబీఐ ఆధారాలతో సహా పట్టుకుందని, ఇక జగన్ రెడ్డి తప్పించుకోలేరని అన్నారు. ఇవాళ సీబీఐ కౌంటర్‌తో అర్థమైందన్నారు. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఆయనకు ఇష్టమైన ప్రదేశానికి తిరిగి వెళతారని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments