Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం వైయస్‌.జగన్‌ రెండేళ్ల పాలనలో మేనిఫెస్టో అమలు తీరు ఎలా వుంది?

సీఎం వైయస్‌.జగన్‌ రెండేళ్ల పాలనలో మేనిఫెస్టో అమలు తీరు ఎలా వుంది?
, శనివారం, 29 మే 2021 (18:23 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పాలనకు రెండేళ్ళు. దేశ చరిత్రలోనే రాజకీయ పార్టీలకు ఆదర్శప్రాయంగా మేనిఫేస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తూ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ.. ఎపిలో శ్రీ వైయస్‌ జగన్‌ పాలన వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమ రాజ్యం దిశగా నడిపిస్తున్న ఈ పాలన... కోట్లాది పేదలకు అండగా నిలుస్తోంది.

కులం లేదు.. మతం లేదు.. వర్గం లేదు... రాజకీయం అసలే లేదు... సిఫార్సులకు చోటే లేదు... అర్హతే ప్రామాణికత... పేదరికమే కొలమానం... దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ... నిర్ధిష్ట కాలపరిమితిలో అర్హతను పరిశీలించి ప్రభుత్వ పథకాలను అందిస్తున్న పారదర్శకమైన వ్యవస్థ. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదు.

నిజమైన ఏ ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వ సాయం అందలేదనే మాట రాకూడదు... ఇదీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ లక్ష్యం. ఇందుకోసం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిక్షణం తపిస్తున్నారు.. శ్రమిస్తున్నారు.. తన పాలనలోఅనేక సంస్కరణలను తీసుకువచ్చి, దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనపరుస్తున్న సీఎంలలో ఒకరుగా అతి తక్కువ పాలనాకాలంలోనే గుర్తింపును సాధించారు. 
 
తన సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను, పేదల కన్నీళ్ళను, వారి బాధలను శ్రీ వైయస్‌ జగన్‌ పంచుకున్నారు. ఆ అనుభవాల నుంచి.. పేదల బాధలను తొలగించాలనే సంకల్పం నుంచి నవరత్నాలకు రూపకల్పన చేశారు. దానితో పాటు అధికారంలోకి వస్తే ఏ రకంగా పేదలను ఆదుకుంటామో, ఎటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని వారికి చేరువ చేస్తామో తెలిపేలా రెండు పేజీల మేనిఫేస్టోను ప్రకటించారు.

ఇప్పటి వరకు పేజీల కొద్ది మేనిఫేస్టోలు, వందల కొద్ది హామీలను గుప్పించే రాజకీయ పార్టీల పంథాకు పూర్తి భిన్నంగా శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటించిన మేనిఫేస్టో, అందులో ఏం చేస్తామో అత్యంత స్పష్టంగా వివరించిన తీరు రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. అంతేకాదు మేనిఫేస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తామని ఆయన చెప్పిన మాటలు... అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే కార్యరూపం దాల్చాయి. 
 
సీఎంగా శ్రీ వైయస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసి ఈనెల 30వ తేదీకి సరిగ్గా రెండేళ్ళు నిండుతున్నాయి. 2019 మే 30వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆనాటి నుంచి నేటి వరకు వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 8,89,18,040 ప్రయోజనాలు కల్పించి రూ.1,31,725.55 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే నగదు బదిలీ (డిబిటి) ద్వారా అందించిన సొమ్ము రూ.95,528.50 కోట్ల రూపాయలు. 
 
–ఎన్నికల్లో రెండు పేజీల మేనిఫెస్టో ద్వారా శ్రీ జగన్‌ చేసిన వాగ్దానాలు 129. 
–ఇందులో అమలు చేసిన వాగ్దానాలు 107
–ఇప్పటికే మొదలు పెట్టి, వివిధ దశల్లో ఉన్న వాగ్దానాలు 15.
– ఇంకా అమలు చేయాల్సినవి 7
–ఇవి కాకుండా మేనిఫెస్టోలో లేకపోయిన మరో 50కి పైగా పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూర్చిన వైయస్‌.జగన్‌
 
జగన్‌ అమలు చేసిన ముఖ్యమైన పథకాలు, లబ్ధిదారులు:
–చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డం కాకూడదనే మంచి ఉద్దేశంతో జగనన్న అమ్మ ఒడి అనే పథకానికి రూపకల్పన చేశారు. దీని ద్వారా చదువుకునే విద్యార్ధుల తల్లుల ఖాతాలకే రెండేళ్ళలో రూ.13,022.93 కోట్లు జమ చేశారు. ఈ పథకం ద్వారా 44,48,865 మంది విద్యార్ధులకు అండగా నిలిచారు. 
 
–జగనన్న వసతి దీవెన (ఎంటిఎఫ్‌) కింద 15,56,956 మందికి రూ.2,269.93 కోట్లు
 
–జగనన్న విద్యాదీవెన (ఆర్‌టిఎఫ్‌) పథకం ద్వారా 18,80,934 మందికి రూ.4,879.30 కోట్లు
 
–విదేశీ విద్యా దీవెన పథకం కింద 1645 మందికి రూ.112.46 కోట్లు,
 
–వైయస్‌ఆర్‌ రైతుభరోసా కింద 52.38 లక్షల రైతులకు రూ.17,029.88 కోట్లు
 
–వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం ద్వారా 58,96,994 మంది రైతులకు రూ.1105.89 కోట్లు
 
–డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా 31,06,641 మంది రైతులకు రూ.3788.25 కోట్లు
 
–రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 13,70,881 మందికి రూ.1055.19 కోట్లు
 
–మత్స్యకార భరోసా కింద 1,09,231 మందికి రూ.331.58 కోట్లు
 
–వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద 98,00,626 స్వయం సహాయక బృందాల (ఎస్‌జిహెచ్‌)కు రూ.2,354.22 కోటు
 
–వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద 61,72,964 మంది లబ్ధిదారులకు రూ.32,469.40 కోట్లు
 
–వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 24,55,534 మందికి రూ.4604.13 కోట్లు
 
–వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా 77,75,681 మందికి రూ.6,310.68 కోట్లు
 
–వైయస్‌ఆర్‌బీమా ద్వారా 1,03,171 మందికి రూ.1681.68 కోట్లు
 
–వైయస్‌ఆర్‌ కాపునేస్తం పథకం ద్వారా 3,27,862 మందికి రూ.491.79 కోట్లు
 
–వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా 81,703 మందికి రూ.383.79 కోట్లు
 
–జగనన్న చేదోడు పథకం ద్వారా 2,98,428 మంది రజక, నాయీ బ్రాహ్మణ, టైలరింగ్‌ లబ్ధిదారులకు రూ.298.43 కోట్లు
 
–వైయస్‌ఆర్‌ వాహన మిత్ర ద్వారా 2,74,015 మందికి రూ.513.95 కోట్లు
 
–డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కింద 4,66,234 మందికి రూ.282.08 కోట్లు
 
–ఎంఎస్‌ఎంఇ రీస్టార్ట్‌ పథకం ద్వారా 16,725 మందికి రూ.904.83 కోట్లు
 
–అగ్రిగోల్డ్‌ బాధితులు 3,34,160 మందికి రూ.236.53 కోట్లు
 
– ఇమామ్, మౌజమ్, పాస్టర్స్, అర్చకులకు వన్‌టైం ఫైనాన్సియల్‌ అసిస్టెన్స్‌ కింద 77,290 మందికి రూ.37.71 కోట్లు
 
– తెల్లరేషన్‌ కార్డు కలిగిన వారికి కోవిడ్‌ స్పెషల్‌ అసిస్టెన్స్‌ కింద 1,35,05,338 మందికి రూ.1350.53 కోట్లు నగదు బదిలీ ద్వారా అందచేశారు.
 
నాన్‌ డిబిటి ద్వారా రూ.36,197.05 కోట్లు:
 
–నగదు బదిలీ కాకుండా ఇతర పథకాలు, కార్యక్రమాల ద్వారా
సంక్షేమ పథకాల ద్వారా ఈ రెండేళ్ళ కాలంలోనే శ్రీ జగన్‌ ప్రభుత్వం రూ.36,197.05 కోట్లు ఖర్చు చేసింది. 
 
–దీనిలో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 13,74,087 మంది లబ్ధిదారులకు వైద్యం ఖర్చు కింద రూ.3400.18 కోట్లు ఖర్చు చేసింది. 
 
–జగనన్న తోడు పథకం ద్వారా 5,31,427 మంది లబ్ధిదారులకు రూ.555.16 కోట్లు ఖర్చు చేసింది.
 
– జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 36,88,618 మంది విద్యార్ధుల కోసం రూ.1600 కోట్లు
 
–వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ద్వారా 30.16 లక్షల మందికి రూ.2881.01 కోట్లు
–జగనన్న విద్యాకానుక ద్వారా 47 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూర్చేందుకు రూ.647.85 కోట్లు.
 
–మొత్తం 30.76 లక్షల మందికి ఇళ్ళస్థలాలు ఇచ్చేందుకు భూసేకరణ,   భూమి అభివృది  కోసం రూ.27 వేల కోట్లు
 
–వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కింద 72,30,018 మందికి మేలు చేసేందుకు రూ.112.85 కోట్లు ఖర్చు చేసింది.
 
పథకాలు అమల్లో సందిగ్ధత, అయోమయం, అందీ అందని తీరుకు చెక్‌:
– గతంలో పథకాలు అమలు చేస్తే అవి ఎప్పుడు అమలవుతాయో, ఎప్పుడు వస్తుందో, ఎంతమందికి వస్తుందో, అసలు వస్తుందా? లేదా? అన్న అయోమయం ఉండేది.
–పాలనలో సంస్కరణల ద్వారా శ్రీ వైయస్‌ జగన్‌ వాటికి చెక్‌ చెప్పారు. 
–వరుసగా రెండో ఏడాది కూడా క్యాలెండర్‌ ప్రకటించారు. ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామో తేదీల వారీగా ప్రకటించి, ఆ సమయానికి వాటిని అమలు చేసి.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదును పంపుతున్నారు. 
– 2021–22 ఆర్థిక సంవత్సరానికి కూడా శ్రీ జగన్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. 
 
–ఏప్రిల్‌–2021లో జగనన్న వసతి దీవెన మొదటి విడత.
జగనన్న విద్యా దీవెన మొదటి విడత, రైతులకు వైయస్సార్‌ సున్నా వడ్డీ (2019.రబీ), పొదుపు సంఘాల మహిళలకు వైయస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపులు.. ఇప్పటికే అమలు జరిగాయి.  
 
– మే–2021 నెలలో వైయస్సార్‌ రైతు భరోసా మొదటి విడత. దాదాపు 50 లక్షల రైతులకు ఇచ్చారు.
 
– మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ). మత్స్యకార భరోసా (డీజిల్‌ సబ్సిడీ) ఇచ్చారు.
 
– వైయస్సార్‌ ఉచిత పంటల బీమా (2020. ఖరీఫ్‌)కు సంబంధించి మే 25న రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.
 
– జూన్‌ 2021లో జగనన్న తోడు. తొలి విడత వైయస్సార్‌ వాహనమిత్ర. రెండో విడత వైయస్సార్‌ చేయూత. మూడో విడత చెల్లింపులు.
 
జూన్‌ 8న జగనన్న తోడు బ్యాలెన్స్‌ ఇవ్వబోతున్నారు. ప్రతి మంగళవారం ఒక్కో కార్యక్రమం. జూన్‌ 8న జగనన్న తోడు, 15న వాహనమిత్ర, 22న చేయూత అమలు జరగనున్నాయి. 
 
జూలై–2021లో
–జగనన్న విద్యా దీవెన రెండో విడత.
–వైయస్సార్‌ కాపు నేస్తం.
–విద్యా కానుక  అమలు కానున్నాయి.
 
ఆగస్టు–2021:
– రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు (2020.ఖరీఫ్‌).
– ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు.
– వైయస్సార్‌ నేతన్న నేస్తం.
– అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు జరుగుతాయి.
 
సెప్టెంబరు–2021:
– వైయస్సార్‌ ఆసరా.
 
అక్టోబరు–2021:
– వైయస్సార్‌ రైతు భరోసా రెండో విడత.
– జగనన్న చేదోడు (రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులు).
 
నవంబరు–2021:
–వైయస్సార్‌ ఈబీసీ నేస్తం. ఇది ఈ ఏడాది అమలు చేసే కొత్త పథకం. ఏటా రూ.15 వేలు చొప్పున సహాయం. అగ్ర వర్ణాల్లోని 45 ఏళ్లు దాటిన అక్కలకు సహాయం.
 
డిసెంబరు–2021:
– జగనన్న వసతి దీవెన రెండో విడత.
– జగనన్న విద్యా దీవెన మూడో విడత. 
– వైయస్సార్‌ లా నేస్తం. 
 
జనవరి–2022:
– పెన్షన్‌ నగదు పెంపు. నెలకు రూ.2500. 
– వైయస్సార్‌ రైతు భరోసా మూడో విడత.
– జగనన్న అమ్మ ఒడి. అమలు కానున్నాయి. 
 
ఫిబ్రవరి–2022:
–జగనన్న విద్యా దీవెన నాలుగో విడత అమలు కానుంది. 
 
ఇవి కాకుండా రెగ్యులర్‌గా వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు పగలు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా, డాక్టర్‌ వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ, డాక్టర్‌ వైయస్సార్‌ ఆరోగ్య ఆసరా, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక ప్రతి నెలా శ్రీ జగన్‌ ప్రభుత్వం అమలు చేయనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనంద‌య్య మందుపై అప్పుడే నిర్ణ‌యం: మంత్రి గౌత‌మ్‌రెడ్డి వెల్ల‌డి