రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. కానీ భారీ వర్షాలు, తుపాన్లతో రైతులు నష్టపోయారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ పంటల బీమా చెల్లింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. 2020 ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు బాగా నష్టపోయారని, అందుకే ఉచిత పంటల బీమా కింద 15.15లక్షల మంది రైతులకు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు.
23 నెలల కాలంలో రైతుల కోసం ₹83వేల కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా కింద ఈ నెలలో రూ. 3,900కోట్లు చెల్లించాం. ఇవాళ పరిహారం కింద 15.15లక్షల మంది రైతులకు రూ.1,820కోట్లు ఇస్తున్నాం. రైతులపై ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే బీమా మొత్తం చెల్లిస్తోంది. ప్రతి ఆర్బీకే కేంద్రంలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తున్నాంఅని సీఎం జగన్ అన్నారు.