Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు తీర్పులకు జగన్ నైతిక బాధ్యత వహించాలి: సీపీఐ

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (19:55 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మొండివైఖరి మార్చుకోకుండా ప్రభుత్వ న్యాయవాదులచే రాజీనామాలు చేయించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయ‌న ఒక ప్రకటన విడుదల చేశారు.

"హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి పలు కేసుల విషయంలో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన పలు వివాదాస్పద అంశాల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసింది.

కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని ప్రభుత్వ న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్ హబీబ్‌లచే రాజీనామా చేయించారు. కొత్తగా న్యాయవాదులను నియమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు అంశాలను వివాదాస్పదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయా తీర్పులకు నైతిక బాధ్యత వహించాలి. 'తాను ఆడలేక మద్దెల ఓడు' అన్నట్లు ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులను రాజీనామా చేయించటం సరికాదు.

ప్రభుత్వం చేసే తప్పులకు న్యాయవాదులు ఎలా కారణమవుతారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన విధానాలను మార్చుకోపోతే ఏ లాయర్లను పెట్టినప్పటికీ కోర్టు తీర్పుల్లో మార్పులుండవని స్పష్టం చేస్తున్నాం" అని రామ‌కృష్ణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments