కాంగ్రెస్‌ను క్షమించానన్న జగన్... కేసీఆర్ నోట్లో పచ్చి వెలక్కాయ...

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (19:10 IST)
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ వుండరని అంటుంటారు. ఇది చాలాసార్లు రుజువైంది కూడా. ఇక ఇప్పటి విషయానికి వస్తే... కొద్దిరోజుల క్రిత తెలంగాణ తెరాస నాయకుడు కేటీఆర్ మాట్లాడుతూ... తాము, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరం కలిసి పనిచేస్తామని అన్నారు. 
 
అంటే.. కేంద్రంలో కాంగ్రెసేతర పార్టీలకు మద్దతు తెలుపుతామని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ ప్రకారంగా చూస్తే జగన్ మోహన్ రెడ్డి కూడా కాంగ్రెసేతర పార్టీలకే మద్దతు ఇవ్వాల్సి వుంటుంది. ఒకవేళ భాజపా మ్యాజిక్ మార్కుకి కాస్త దూరంలో నిలబడితే బలాన్ని వైసీపీ ఇవ్వాలన్నమాట. ఐతే దుర్లభం అని జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యల ద్వారా తేలిపోయింది. 
 
ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి భాజపా మోసం చేసిందనీ, అలాంటి పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు జగన్. కాబట్టి కేంద్రంలో వైకాపా సపోర్ట్ భాజపాయేతర పార్టీలకు మాత్రమే జగన్ మోహన్ రెడ్డి ఇస్తారని అర్థమవుతుంది. ఆ ప్రకారం చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుకున్న ఆశలకు జగన్ గండి కొట్టినట్లే అవుతుంది. చూడాలి ఎన్నికల ఫలితాలు ఎవరిని ఎలా మారుస్తాయో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments