జ‌గ‌న్ కొత్త త‌ర‌హా నేత‌, బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టాడు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (17:06 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త తరహా నాయకుడ‌ని, సంప్రదాయ బద్ధమైన నాయకుడు కాద‌ని ప్రభుత్వ సలహాదారులు సజ్జ‌ల రామకృష్ణ రెడ్డి విశ్లేషించారు. సంప్రదాయ బద్దమైన రాజకీయాలు చేస్తూ, త‌న‌ లబ్ది కోసం కాకుండా, భావితరాల భవిష్యత్తు కోసం చూసే నాయకుడ‌ని కొనియాడారు.

కొంతమంది చేయలేని పనులను మన నాయకుడు చేస్తుంటే, రాజకీయ శూన్యంతో కొంద‌రు ఆరోపణలు చేస్తూ, పిచ్చిరాతలు రాస్తున్నార‌ని ఎల్లో మీడియాను స‌జ్జ‌ల దుయ్య‌బ‌ట్టారు. ఇలాంటి దుష్పచారాలను మనమందరం కలిసి తిప్పికొట్టాల‌న్నారు. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా బిసిల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిఅని, గత నాయకులు బలహీనవర్గాలను ఓటు బ్యాంకుగా చూస్తే, వారి ఎదుగుదల కోసం జ‌గ‌న్ కృషి చేస్తున్నార‌న్నారు.

ముఖ్యమంత్రి బిసిలోని 139 కులాలకు గొప్ప అవకాశం కల్పించార‌ని, దానిని ఉపయోగించుకొని సామజికంగా,రాజకీయంగా ఎదగాల‌ని పిలుపునిచ్చారు. మిమ్మల్ని ఓటు బ్యాంకుగా చూసే వారికి మీ ఎదుగుదలే సమాధానంగా మారాలి అని జ‌గ‌న్ ఆకాంక్షగా చెప్పారు. బిసి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నా అని స‌జ్జ‌ల పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments