ఖరీఫ్ పంట సాగుకు పుష్కలంగా నీరు అందింస్తాం: జక్కంపూడి

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (17:00 IST)
రాష్ట్రంలో ఉన్న రైతులకు ఖరిఫ్ పంటకు సాగునీరు అదించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు చేపడుతున్నారని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు.
 
మంగళవారం నాడు సీతానగరం మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో తొర్రిగెడ్డ ఎత్తిపోతల పధకం రెండు పైపుల ద్వారా క్రింద ఉన్న ఆయుకట్టకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు..
 
ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రైతులకు ఖారీఫ్ పంట సాగులో ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం ద్వారా 240 క్యూసెక్కుల నీటిని క్రింద ఉన్న ఆయుకట్టకు విడుదల చేయడం జరిగిందన్నారు. తద్వారా రాజానగరం నియోజక వర్గంలో కోరుకొండ, సీతానగరం మండల పరిధిలో 15 గ్రామాల రైతులకు ఖారీఫ్ పంటకు సాగునీటిని అందించడం జరుగుతుందన్నారు.
 
ఈ తొర్రిగడ్డ ఎత్తిపోతల పధకం ద్వారా రాజానగరం నియోజక వర్గంలో 13,451 ఎకరాల ఖరీఫ్ పంటకు  సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఈ ఆనంద్ బాబు, ఎ.ఈ శివ ప్రసాద్ వై. యస్.ఆర్.సి.పి నాయకులు డాక్టర్ బాబు, సత్తిపండు రాజు, పి.పి. రాజు, కోయిట రాజు,సురేష్ రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments