Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపూజ మహోత్సవంలో జగన్‌

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (13:48 IST)
గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 11.30 సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. తొలుతగా మున్సిపల్‌ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు.

అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. ‘ఒక గోవులో 33 కోట్ల దేవతలుంటారనేది ప్రతీతని, గోవును పూజిస్తే ఆ దేవతల కరుణా కటాక్షాలూ లభిస్తాయని’ గోపూజ మహోత్సవ విశిష్టత గురించి నరసరావుపేట ఇస్కాన్‌ టెంపుల్‌ కార్య నిర్వాహకుడు వైష్ణవ కృష్ణదాస్‌ వివరించారు. ప్రతి ఇంట్లో గోవులను పూజించాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ ఆచరించి చూపిస్తున్నారని ఆయన కొనియాడారు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments