Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవుతో రాజకీయాలా?: అచ్చెన్న

Advertiesment
గోవుతో రాజకీయాలా?: అచ్చెన్న
, శుక్రవారం, 15 జనవరి 2021 (13:40 IST)
గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 
 
"గోవును కోటి దేవతలకు ప్రతిరూపంగా ప్రజలు భావిస్తారు. గోవును అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం జగన్ రెడ్డి దుర్మార్గానికి నిదర్శనం. సరైన పోషణ లేక ఎన్నో గోవులు మృత్యువాత పడ్డాయి. దానిపై స్పందించని ముఖ్యమంత్రి నేడు గుడికో గోమాత అంటూ విలక్షణ నటనకు తెరతీశారు.

ఇడుపులపాయలో క్రూర మృగాలను పెంచుతూ గుడికో గోమాత కార్యక్రమం చేపట్టడం విడ్డూరం. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆర్హత ముఖ్యమంత్రికి లేదు. రథాలు తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేయించి మరో వైపు పూజల్లో పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో ఏ మతంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారో చెప్పాలి.

బాబాయి హత్యపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడనేది భ్రమ. అంతరించిపోతున్న నాటకరంగానికి  జగన్ నటనతో జీవం పోస్తున్నారు. ఏ మాతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం జగన్ కు లేదు. అందుకే క్రిష్టియన్లకు క్రిస్మస్ కానుక, ముస్లింలకు రంజాన్ కానుక, హిందువులకు సంక్రాంతి కానుక దూరం చేశారు. 

ఆలయాలపై జరిగే దాడులకు రాజకీయ రంగు పులిమారు తప్ప ఆ దాడులను నివారించడంలో చిత్తశుద్ధి చూపారా? హిందూ మతాన్ని ఉద్దరించేలా నాటకాలాడుతున్నారు. అభినవ నటుడు జగన్ రెడ్డి ముందు కళాకారులు కూడా సాటిరారు. మీ కళా నాట్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏ రోజు దాడులు జరగకుండా ఉన్నాయో చెప్పండి.?

ఇంతవరకు ఒక్కరినైనా ఎందుకు పట్టుకోలేదు? మొదటి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వానికి సూచించాం. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి నేడు ప్రతిపక్ష పార్టీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడం చేతకాని ప్రభుత్వం రాష్టానికి అవసరమా? ఈ ప్రభుత్వ తీరును ప్రజలు ఆలోచించాలి.

మాన్సాస్ ట్రస్టు నుంచి అశోక్ గజపతిరాజుని ఛైర్మన్ గా తొలగించినా జగన్ కక్ష తీరలేదు. అందుకే రామతీర్థంలో రాముడి విగ్రహం ద్వంసం చేసి అశోక్ గజపతిరాజును భాద్యున్ని చేస్తూ గుడి చైర్మన్ పదవి నుండి తొలిగిoచారు. 150 దేవాలయాలపై డాడులు జరిగినందుకు మీ 151 మంది తొలగించాలి కదా.

మతాల మధ్య మంట పెట్టి చలికాచుకునే విధానానికి వైసీపీ స్వస్తి పలకాలి. లేకుంటే అదే మంటల్లో ప్రజలు వైసీపీని వేస్తారనడంలో సందేహం లేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ వద్దే వద్దు బాబోయ్.. విపరీతంగా డౌన్‌లోడ్లు పెరిగపోతున్నాయ్