Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు అండగా ఉండాల్సిన భాధ్యత ప్రభుత్వానిదే: గవర్నర్

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (07:03 IST)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏలూరు సంఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ విషయంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చరవాణి ద్వారా సంభాషించారు.

స్దానికంగా నెలకొన్న తాజా పరిస్ధితులను గవర్నర్ తెలుసుకున్నారు. గత మూడు రోజులుగా సుమారు 467 మంది వింత వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరారని, ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందించటం వల్ల 263 మంది కోలుకుని తమ నివాసాలకు చేరుకున్నారన్నారని సిఎం వివరించారు.

వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి చేరుతున్న వారందరికీ పూర్తి స్దాయి వైద్యం అందిస్తున్నామని, అత్యవసర పరిస్ధితిలో ఉన్న వారిని విజయవాడ తరలించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు జాతీయ స్దాయి వైద్య ఆరోగ్య పరిశోధనా సంస్ధల సహకారం తీసుకుంటున్నామని, ఎయిమ్స్, ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఐఎన్ వంటి సంస్ధలు బాధితుల రక్త నమూనాలతో పాటు అవసరమైన ఇతర అన్ని నమూనాలను పరిక్షిస్తున్నాయని ముఖ్యమంత్రి  తెలిపారు.

వింత వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించే క్రమంలో, ప్రభుత్వపరంగా మరింత అప్రమత్తత అవసరమని, వేగవంతమైన పనితీరు కనబరిచేలా స్ధానిక, వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గవర్నర్ సూచించారు.

కేంద్రం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్దంగా ఉందని, ప్రజలకు అన్ని విధాల ధైర్యం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రికి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments