Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తుఫాను బాధితులకు అండగా ప్రభుత్వం : ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా

Advertiesment
తుఫాను బాధితులకు అండగా ప్రభుత్వం : ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా
, శుక్రవారం, 27 నవంబరు 2020 (22:44 IST)
"నివర్" తుఫాను, బుగ్గవంక వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని, ఎలాంటి భయాందోళన అవసరం లేదని.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు.విజయవాడ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా.. గురువారం కడపలో వరద పరిస్థితిని తెలుసుకున్న వెంటనే తన పర్యటనను రద్దుచేసుకుని..  హుటాహుటిన గురువారం అర్ధరాత్రి కడప చేరుకున్నారు. 
 
శుక్రవారం నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలయిన బాలాజీ కాలనీ, నాగరాజుపేట, రవీంద్రనగర్, అల్మాస్ పేట, గుర్రాలగడ్డ, శహమీరియా మజీద్ తదితర బుగ్గవంక పరివాహ ప్రాంతాల్లో నీరు చేరిన నివాసాలను, అక్కడి తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో వసతులను ఆయన పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల బాగోగులను పరామర్శించారు.
 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నివర్" తుఫాను ప్రభావం కారణంగా జిల్లాలో కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాల కారణంగా.. పలు ప్రాంతాల్లో.. నివాసాల్లోకి వరదనీరు చేరుతున్న దృష్ట్యా... జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయిందన్నారు. గురువారం రాత్రి బుగ్గవంక పరివాహ ప్రాంతాల్లో వరద ఉధృతికి నివాసాల్లోకి నీరు చేరడంతో.. తక్షణమే.. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందన్నారు.

పరివాహ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను.. జిల్లా యంత్రాంగం నగరంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాల్లో చేర్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం బుగ్గవంక వరద ఉధృతి తగ్గడంతో.. కొంతమంది ప్రజలు వారి నివాసాల్లోకి చేరుకుని శుద్ధి చేసుకుని చక్కబెట్టుకుంటున్నారన్నారు. ఈ నేపత్యంలో వారికి అవసరమైన రేషన్, అత్యవసర మందుల పంపిణీ చేపడుతామన్నారు. 
 
ఈ సందర్బంగా నాగరాజుపేటలోని.. నగరపాలక ఉన్నత పాఠశాల (గుండాచారి బడి)లో ఏర్పాటు చేసిన తాత్కాలిక సహాయక పునరావాస కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పరిశీలించారు. అక్కడి వసతులను పరిశీలించి, ప్రభుత్వం అండగా ఉందని.. బాధితులకు ధైర్యం చెప్పారు.
 
వర్షం నిరంతరాయంగా కురుస్తుండటంతో.. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. విఫత్తుల నిర్వహణ, రెస్క్యు టీమ్ సిబ్బంది సహాయంతో.. తెప్పలు, గాలి ట్యూబులు, మరబోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.
 
అత్యవసర సహాయక చర్యల్లో భాగంగా.. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం తో పాటు కడప, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం నందు  24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడమైనదన్నారు.
 
ఈ కార్యక్రమంలో.. వైసీపీ కడప పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ మేయర్ సురేష్ బాబు, వైసీపీ నేత అహ్మద్ బాషా, తహశీల్దారు శివరామిరెడ్డి, ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు నిత్యానంద రెడ్డి, ఐస్ క్రీమ్ రవి, జమాల్, రెడ్డి ప్రసాద్, బలస్వామిరెడ్డి, అజ్మతుల్లా, చల్ల రాజశేఖర్, రాజశేఖర్ రెడ్డి, కమల్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణాజిల్లాలో పాండురంగని ఉత్సవాలు ప్రారంభం