Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ అలా కోరడం సరి కాదు: సీబీఐ

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (08:40 IST)
వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.

ఈ  పిటిషన్లను కొట్టేయాలంటూ సీబీఐ హైదరాబాద్‌ విభాగం ఎస్పీ పీసీ కల్యాణ్‌.. 17 పేజీల కౌంటర్‌ అఫివిడవిట్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని.. అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరడం సరికాదని సీబీఐ స్పష్టం చేసింది.

హాజరు మినహాయింపు ఏ నిందితుడికీ హక్కు కాదని, అది న్యాయస్థానం విచక్షణాధికారమని పేర్కొంది. నిందితుడి హోదా, ఆర్థిక స్తోమత కోర్టుపై ప్రభావం చూపలేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని తెలిపింది. 
 
‘చిన్న చిన్న కేసుల్లో న్యాయస్థానాలు విచక్షణాధికారం మేరకు నిందితుల వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇస్తాయి. అయితే జగన్‌పై ఉన్నవి తీవ్రమైన ఆర్థిక నేరాలు. వీటిలో హాజరు మినహాయింపు ఇవ్వడం సరికాదు.

సీఎం హోదా ఉందన్న కారణంగా మినహాయింపు ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తీవ్రమైన ఆర్థిక నేరం కాబట్టి మినహాయింపు ఇవ్వలేమని 2014 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 2016లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఇదే అభ్యర్థనతో మరోసారి పిటిషన్లు దాఖలు చేయగా వాటినీ అదే కోర్టు కొట్టివేసింది.

దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లను కూడా హైకోర్టు 2017 ఆగస్టు 31న కొట్టేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తాను అధికారిక విధులు నిర్వహించాల్సి ఉందం టూ హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను గత నవంబరు 1న సీబీఐ కో ర్టు మరోసారి కొట్టేసింది.

ఈ కేసులో హైకోర్టు ఆ దేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించి.. 2012లో మొదటి చార్జిషీటు దాఖలు చేశాం. 2014లో తు ది చార్జిషీటు వేశాం. అయినా ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు విచారణ ప్రక్రియలో ఎటువంటి మార్పులేదు’ అని సీబీఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments