రోజాను వైసిపి అధ్యక్షురాలిగా చేయండి... సోమిరెడ్డి(వీడియో)

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఒకడుగు ముందుకు వేసి ఎంపిలతో రాజీనామా చేయించడానికి జగన్ సిద్ధమైన నేపధ్యంలో టిడిపి నేతలు ఆ పార్టీలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏక

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (18:32 IST)
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఒకడుగు ముందుకు వేసి ఎంపిలతో రాజీనామా చేయించడానికి జగన్ సిద్ధమైన నేపధ్యంలో టిడిపి నేతలు ఆ పార్టీలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏకంగా మంత్రులే రంగంలోకి దిగి విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
 
తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి విమర్శలే చేశారు. ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉండటానికి అనర్హుడన్నారాయన. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే జగన్ పైన 11 కేసులు 13 ఛార్జ్‌షీటులు ఫైల్ చేస్తే తాజాగా 14వ ఛార్జ్ షీట్‌ను కూడా ఫైల్ చేసిందని చెప్పారు. 
 
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లొగొట్టిన జగన్ పార్టీ అధ్యక్షుడి నుంచి తప్పుకుని వెంటనే ఆ బాధ్యతను రోజాకు గాని, అంబటి రాంబాబుకు గాని అప్పజెప్పాలన్నారు. ఆంధ్రకు రావాల్సిన వాటిపై కేంద్ర ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలా ఢిల్లీలో ఒక మాట, బయటకొచ్చి మరోమాట మాట్లాడి ప్రజలను మోసం చేయడం తెలుగుదేశం పార్టీకి తెలియదన్నారు. చూడండి ఆయన మాటల్లోనే వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments