Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పచ్చని పొలం గట్టు ప్రక్కన కోటు వేసుకుని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

IRRI వారి ప్రాంతీయ వినూత్న ఆవిష్కరణ కేంద్ర స్థాపన.. .(IRRI–REGIONAL INNOVATIVE CENTRE): దక్షిణ భారత దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పపటానికి IRRI డైరెక్టర్ జనరల్ సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ రీజినల్ సెంటర్‌ను రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్

పచ్చని పొలం గట్టు ప్రక్కన కోటు వేసుకుని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
, గురువారం, 8 ఫిబ్రవరి 2018 (21:02 IST)
IRRI వారి ప్రాంతీయ వినూత్న ఆవిష్కరణ కేంద్ర స్థాపన.. .(IRRI–REGIONAL INNOVATIVE CENTRE): దక్షిణ భారత దేశంలో మన ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో నెలకొల్పపటానికి IRRI డైరెక్టర్ జనరల్ సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ రీజినల్ సెంటర్‌ను రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసి వారితో కలిసి పనిచేస్తుందని తెలిపారు.
 
ఉత్తర భారతదేశంలోని వారణాసిలో IRRI వారు స్థాపించిన IRRI-innovative రీజినల్ సెంటర్ మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా వరి ఉత్పాదకతను పెంచుటకు, వరి ఆధారిత పంటల వ్యవస్థను అభివృద్ధి చేయుటకు, వరిలో కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి, వరిలో బయో ఫోర్టిఫికేషన్ జోడించేందుకు, చౌడు పొలాల్లో, ఉప్పు నీటిని తట్టుకొనే రకాలను వృద్ది చేయడం, గ్రీన్ సూపర్ రైస్‌ను వృద్ది చేయడం మొదలైన అంశాల లక్ష్యంగా ఈ రీజినల్ సెంటర్‌ను దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకోవడం జరిగింది.
 
ఉపగ్రహ ఆధారిత వరి పర్యవేక్షణ వ్యవస్థ: (Satellite based Rice Monitoring System)
ఇటీవల రాష్ట్రంలోని వ్యవసాయ విద్యాలయం International Rice Reserach Institute వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యూనివర్సిటీ ప్రాంగణంలో శాటిలైట్ ఆధారిత వరి పర్యవేక్షణ వ్యవస్థ (Satellite based Rice Monitoring System) ఏర్పాటు చేసే క్రమంలో రూ. 33 లక్షల విలువతో ప్రయోగశాలను యూనివర్సిటీలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత తెలియచేసారు. దీనిలో భాగంగానే వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలకు, ఎకనామిక్స్ మరియు స్టాటిస్టిక్ డిపార్టుమెంటు అధికారులకు మరియు వ్యవసాయ అధికారులకు International Rice Reserach Institute సంస్థ వారి ఆధ్వర్యంలో మార్చి నెలలో శిక్షణా కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన మెగా సీడ్ పార్క్‌లో కూడా ఈ IRRI సంస్థ కలిసి పని చేయటానికి సంసిద్ధత తెలియచేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఫిలిప్పీన్స్ దేశంలో వరి పంటకు సంబందించిన అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (IRRI) దాని అనుబంద సంస్థల స్టడీ టూర్ కార్యక్రమంలో మనీలా లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థను సందర్శించటం జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ ఎంపీలకు అండగా నిలిచిన సోనియా గాంధీ